మీ ఉద్యోగం పోగొట్టుకోవడానికి ఉపయోగపడే 15 కారణాలు

మా చిన్నప్పుడు గవర్నమెంటు ఉద్యోగుల మీద ఒక సామెత వినిపిస్తుండేది. ”పనిచేసేవాడికి పల్లేరుగాయలు, ఎగ్గొట్టేవాడికి ఎదురు నమస్కారాలు” అని. సర్కారీ కొలువుల్లో ఇప్పుడా వైరస్‌ ప్రభావం కొంచెం తగ్గింది కానీ, ప్రయివేటు రంగంలో మాత్రం బలంగానే కనిపిస్తోంది. క్యాపిటల్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ప్రాజెక్ట్స్‌, రెవెన్యూ – అనే నాలుగు స్తంభాల మీద నిలబడి పనిచేసే ప్రయివేటు కంపెనీల్లో ఉద్యోగాలు సాధించడం ఎంత కష్టమో, వాటిని నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టంగా మారుతోంది. ఆఫీసులు కూడా అనేక వైరుధ్యాలకు తావులవుతున్నాయి. ఇక్కడ కూడా … ఒళ్లొంచి పనిచేసేవాడికి పల్లేరుగాయలు, రాజకీయాలు చేసేవాడికి ఎదురునమస్కారాలు అనే తరహా పరిస్థితులు ఎదురవుతున్నాయి.

సబ్జెక్ట్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, కష్టపడి పనిచేసే తత్వం వుంటే చాలు, ఎక్కడైనా పనిలో స్థిరపడిపోవచ్చని చాలామంది భావిస్తారు. నిజమే. కానీ, ఈ మూడింటినీ పెంచుకుంటూ, పై పేరాలో పేర్కొన్న మూడింటినీ తగ్గించుకుంటూ వెళ్లకపోతే, ఇక ఉద్యోగానికి నీళ్లు ఒదులుకోవడమే. ఇరవై ఏళ్ల చదువులు, అనేక ఆటంకాలను తట్టుకుంటూ, వాటికి ఎదురునిలబడి గెలుస్తూ ఉద్యోగ జీవితంలోకి అడుగుపెట్టిన మనిషికి అక్కడి పరిస్థితులు అవకాశాల్ని పెంచేలా వుండాలి కానీ, అతడిని నిస్పృహలోకి దించేలా వుండకూడదు. అఫ్‌కోర్స్‌, మనం ఎలా కావాలనుకుంటే అలా మడుచుకోవడానికి జీవితం చాప కాదు. ‘ఎప్పటికెయ్యది నెయ్యమో అప్పటికా మాటలాడి’ అనే సుమతీ పద్యాన్ని కూడా పాటించలేం. కానీ, ఈ సమస్యల నుంచి బయటపడాలి, లేకుంటే భవిష్యత్‌ లేదు.

ఈ వ్యాసంలో రాస్తున్న అంశాలన్నీ ఇటువంటి యువతీయువకులను దృష్టిలో పెట్టుకునే తీసుకున్నాను. పరిష్కారాలను సూచించడం కంటే, మనం చేసే తప్పులు, పొరపాట్లను ప్రస్తావించడమే ప్రధానంగా తీసుకున్నాను. ఏది చేయకూడదో అది స్పష్టంగా రాస్తే, అది ఎందుకు చేయకూడదో తెలుసుకోగల నైపుణ్యం మన కొత్తతరం ఉద్యోగులకు వుందని నా నమ్మకం.

ఇక పదండి, ఉద్యోగాలు పోగొట్టుకోవడానికి ఉపయోగపడే 15 కారణాలను వరుసగా చూద్దాం.

1) పనిలో నాన్చుడు ధోరణి

చాలామంది ఉద్యోగులు తమకు అప్పగించిన పనిని ఎప్పటికప్పుడు పూర్తిచేయకుండా, ఆఖరి నిముషం దాకా నాన్చడం, లాస్ట్‌ అవర్‌లో హడావుడిగా పని ప్రారంభించడం చూస్తుంటాం. సహజంగా ఆఫీసులో పనులన్నీ చాలామంది ఉద్యోగుల బాధ్యతలతో కనెక్ట్‌ అయివుంటాయి. మనలో ఒక్కరు చేసే డిలే కారణంగా ఇతరుల పనులు కూడా ఆలస్యమవుతుంటాయి. ఆఖరి నిముషంలో పని తొందర తొందరగా పూర్తి చేయాలనే వేడిలో మన లోపలి ఆవేశం బయటికి తన్నుకొచ్చేస్తుంది. ఆలస్యానికి కారణం మనమే అయినా, దానిని ఒప్పుకోవడం కంటే సహోద్యోగుల మీదికి దానిని తోసేయడానికే ఎక్కువ ఇష్టపడతార. ఫలితంగా ప్రాజెక్టు డిలే కావడానికి ప్రథమ కారణం మనమే అవుతుంటాం.

(పూర్తి వ్యాసం కోసం ‘వ‌ర్క్‌ప్లేస్‌లో ఇలా గెల‌వండి’ పుస్త‌కం చ‌ద‌వండి).

————————————————————————–

టైటిల్ః వ‌ర్క్‌ప్లేస్‌లో ఇలా గెల‌వండి. ర‌చ‌యితః సురేశ్ వెలుగూరి. పేజీలుః 192, ధ‌రః రు.199.
ప్రింట్‌ కాపీలు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌ లోని ప్ర‌ముఖ బుక్‌స్టోర్స్ అన్నిచోట్లా ల‌భిస్తాయి.
అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, కోబో, కినిగె వంటి ప్ర‌ముఖ ఈబుక్ స్టోర్స్ నుంచి ఈ పుస్త‌కం ఎల‌క్ట్రానిక్ కాపీలు కొనుక్కోవ‌చ్చు.

amazon-india-logo         Flipkart_logo       kobo_logo_FINALPMS     Kinige_logo_big

ఈ పుస్త‌కంలోని వ్యాసాల ప‌రిచ‌యాన్ని చ‌ద‌వాలంటే ఇక్క‌డ క్లిక్ చేయండి.

గుర్తుంచుకోండి, మీ ఉద్యోగ ప్ర‌దేశంలో మిమ్మ‌ల్ని గెలిపించే కీల‌క స‌మాచార‌మంతా ఈ పుస్త‌కంలో వుంది. ఇది మీ ద‌గ్గ‌రుంటే మీరు నిర్భ‌యంగా, నిరంత‌రాయంగా ప‌నిచేసుకుంటూ వెళ్లిపోవ‌చ్చు. ఏ రంగంలో ప‌నిచేస్తున్నార‌నే దానితో సంబంధం లేకుండా … ప్ర‌తి ఉద్యోగి వ‌ద్ద త‌ప్ప‌క వుండితీరాల్సిన పుస్త‌కం. మీ కాపీని నేడే ఆర్డ‌ర్ చేయండి. ఆల్ ది బెస్ట్‌.

Author’s blog: vmrgsuresh.wordpress.com
Follow Suresh on Facebook & Twitter: vmrgsuresh

Published by

myworkplacebooks

Myself Suresh Veluguri, a Content Writer & Language Services Manager by profession and social analyst by passion. I am producing some content for the benefit of young employees, managers and enterprenuers irrespective of their working domain. Here I am posting all the articles. Thank you.

Leave a comment