ఆ అమ్మాయిలు లేకుంటే ఈ పుస్త‌కం లేదు …

ఒక స్నేహితుడి చెల్లెలు బెంగుళూరు జయదేవా ప్రాంతంలోని ఒక ఎమ్‌ఎన్‌సీ ఐటీ కంపెనీలో పనిచేస్తోంది. రెండేళ్ల క్రితం ఒక మధ్యాహ్నం తనని లంచ్‌కి బయటికి తీసుకువెళ్లాను. చాలా ముభావంగా, ముక్తసరిగా వుంది. ఒకటికి నాలుగుసార్లు రెట్టించి అడిగితే కారణం చెప్పింది. కారణం కాదు, కారణాలు చెప్పింది. కంపెనీలో ఆ అమ్మాయికి నెలకి 35 వేల రూపాయల జీతమొస్తోంది. అది వదులుకోలేదు. అలాగని అక్కడున్న పరిస్థితుల్లో ఉద్యోగంలో కొనసాగనూలేదు. తనను తన కోణం నుంచి అర్థం చేసుకోవడానికి చాలాసేపు పట్టింది.

చివర్లో ఒక ప్రశ్నడిగాను. ‘ఈ సమస్య నీకొక్కదానిదేనా?’ అని. అవుననే జవాబు వస్తుందనుకున్నాను. కానీ ఆశ్చర్యంగా, ఆఫీసులో మెజారిటీ స్టాఫ్‌ తనలాగే ఇబ్బంది పడుతున్నారని చెప్పింది. ఎంత ప‌నిఒత్తిడినైనా త‌ట్టుకోగ‌లుగుతాం కానీ, విపరీతమైన రాజకీయాలు, ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్‌, బాసిజమ్‌, ఇంకా చాలా ఇబ్బందులున్నాయని చెప్పింది. తను చెప్పిన ఇంకో కారణం వినగానే నాకు కళ్లలోకి అమాంతం నీళ్లు ఉబికాయి. కొంతమందైతే ఇంటినుంచి తెచ్చుకున్న లంచ్‌ బాక్సులు కూడా తెరవరని, ఆకలి చంపేస్తున్నా, భయంతో పనిచేసుకుంటూపోతారని చెప్పింది.

బెంగుళూరు నుంచి తిరిగొస్తున్నప్పుడు విమానంలో ఒక ఎయిర్‌హోస్టెస్‌ తమ సేవలెలా వున్నాయో తెలపాలని కోరుతూ ఒక సర్వే ఫారాన్ని నాచేతికిచ్చింది. నేను రెగ్యులర్‌గా విమానాల్లో ప్రయాణించేవాడిని కాదని, నా అభిప్రాయాలు పెద్దగా ఉపయోగపడకపోవచ్చని ఆమెకి చెప్పాను. ఆ అమ్మాయి మాత్రం ఇది కంపల్సరీ సర్‌ అంది. ఫారం పూర్తిచేస్తూ ఆమెవైపు చూశాను. తన చేతులు బిర్రబిగుసుకుపోయివున్నాయి. కస్టమర్‌ రివ్యూలు ఉద్యోగుల జీవితాల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయో అర్థమైంది. పాజిటివ్‌గా ఫారాన్ని పూర్తిచేసి ఆమెకిచ్చాను. ఆమె ఊపిరి పీల్చుకుంటూ నవ్వుముఖంతో వెళ్లిపోయింది. నా ముందుసీట్లో కూర్చున్న వ్యక్తి దగ్గరికి వెళ్లగానే మళ్లీ ఆమె చేతులు బిగుసుకుపోవడం, మనిషి వర్టికల్‌గా స్టిఫ్‌ అయిపోవడం గమనించాను.

ఈ రెండు అంశాలూ నా మ‌న‌సులో తీవ్ర‌మైన క‌ల‌త‌ను రేపాయి. ఎన్నో కొత్త ఆశ‌ల‌తో, జీవితం మీద గొప్ప న‌మ్మ‌కంతో ఉద్యోగాల్లో చేరి, మంచి భ‌విష్య‌త్తు సంపాదించుకోగ‌ల‌మ‌నే విశ్వాసంతో వున్న యువ‌తీయువ‌కులు ఇలాంటి పోక‌డ‌ల‌ను ఎదుర్కోలేక‌పోతే అది వ్య‌క్తిగ‌తంగా వారికి మాత్ర‌మే కాదు, మొత్తం దేశానికే న‌ష్టం. వ‌ర్క్‌ప్లేస్‌లో ఎదుర‌య్యే ఇలాంటి వంద‌లాది అంశాల‌పై వారికి స‌రైన మార్గ‌ద‌ర్శ‌నం ఇవ్వ‌గ‌లిగితే దేశానికి నావంతు ఉప‌యోగ‌ప‌డిన‌వాడిన‌వుతాన‌నే ఆలోచ‌న క‌లిగింది. నాకు తెలిసిన విద్య, నా వృత్తి రాయ‌డం, శిక్ష‌ణ ఇవ్వ‌డం మాత్ర‌మే కాబ‌ట్టి నా ప‌నిముట్ల‌నే ఉప‌యోగించుకుంటూ వ‌ర్క్‌ప్లేస్‌లో ఇలా గెల‌వండి!! పేరుతో తెలుగులో ఒక పుస్త‌కం రూపొందించాను.

ఈ 180 పేజీల పుస్త‌కం రాయ‌డానికి నాకు ఏడు నెల‌ల‌కు పైగా ప‌ట్టింది. ర్యాండ‌మ్‌గా ఎంచుకున్న‌ 300 మందికి పైగా ఉద్యోగుల‌తో ప‌లు విష‌యాల‌పై మాట్లాడాను. 20కి పైగా వ‌ర్క్‌ప్లేస్‌ల‌ను ద‌గ్గ‌ర‌గా ప‌రిశీలించాను. కొంద‌రు మాన‌సిక నిపుణులు, వృత్తినిపుణులతో సంప్ర‌దించాను. చివ‌రికి మాన‌వ‌శాస్త్రం (ఆంత్రోపాల‌జీ) నిపుణులు డాక్ట‌ర్ గునుగుంట్ల కేశ‌వ‌రెడ్డి గారి విలువైన సాయం కూడా తీసుకున్నాను. అనేక స‌వ‌ర‌ణ‌లు, అప్‌డేట్స్ త‌ర్వాత 180 పేజీల‌తో పుస్త‌కం ఫైన‌ల్ అయింది. వర్క్‌ప్లేస్ మేనేజ్‌మెంట్ అంశంలో తెలుగులో మొట్ట‌మొద‌టి పుస్త‌కం విడుద‌ల చేసిన సంతృప్తి మిగిలింది.

పుస్త‌కం రాసింది నేనే అయినా, అందుకు ప్రేర‌ణ‌నిచ్చిన చెల్లెలు నిర్మ‌ల‌, ఎయిర్‌హోస్టెస్ సోద‌రి అనీలా క్రిస్టోఫ‌ర్‌ల‌కు ఈ పుస్త‌కం ప్రేమ‌గా అంకిత‌మిస్తున్నాను. ఈ ఇద్ద‌ర‌మ్మాయిలు లేకుండా ఈ పుస్త‌కం లేదు.

ఆఫీసు రాజ‌కీయాల‌ను ఎదుర్కోవ‌డం ఎలా?

office politicsఆఫీసంటేనే ఒకరితో ఒకరు సంప్రదించుకుంటూ వ్యవహారాలు చక్కబెట్టుకునే చోటు. ఇక్కడ ఒకరికి మరొకరితో నిత్యం, ప్రతి నిముషం ఏదోఒక అవసరం పడుతూనే వుంటుంది. ఉద్యోగుల మధ్య సయోధ్యపూరిత వాతావరణం వున్నచోట్ల మాత్రమే కంపెనీ ఉత్పాదకశక్తి పెరుగుతుంది. అలా కాకుండా, ఉద్యోగుల మధ్య నిత్యం ఘర్షణపూర్వక వాతావరణం వుండే కంపెనీలు ఎంతోకాలం మనుగడ సాగించలేవు.

ఆఫీసు రాజకీయాలను అర్థం చేసుకోవడం అంటే – ”తమ బలాలు, బలహీనతలను నెగటివ్‌ కోణం నుంచి ఉపయోగించుకునే మనుషుల్ని అర్థం చేసుకోవడం” అని చెప్పొచ్చు. పదిమంది కలిసి పనిచేసేచోట ఒకరిపై ఒకరికి అభిప్రాయ భేదాలు రావడం ఆరోగ్యకరం కాదు. ఇది ఆఫీసు వాతావరణాన్నే కాదు, ఉద్యోగుల శక్తి సామర్థ్యాలను, కంపెనీ భవిష్యత్తును కూడా దెబ్బతీస్తుంది. సహజంగా, బాధ్యతల నిర్వహణలో ఉద్యోగుల మధ్య సరైన సమన్వయం లేనప్పుడే ఆఫీసుల్లో రాజకీయాలు పుట్టుకొస్తాయి.

నిజానికి, పనిచేసే సామర్థ్యాలు లేనివాళ్లే ఆఫీసు రాజకీయాలకు పాల్పడతారని చెప్పుకో వచ్చు. చెప్పుడుమాటలు వినడం, పితూరీలు చెప్పడం, ఉన్నవీ లేనివీ కల్పించి ప్రచారం చేయడం ద్వారా సహోద్యోగుల మధ్య భేదాభిప్రాయాలు, విభేదాలు సృష్టించడం, అహంకారపూరిత ప్రవర్తనలు … ఇవన్నీ ఆఫీసు రాజకీయాల కిందికే వస్తాయి.

బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించడం చేతకానివాళ్లు, తమ మాటే చెల్లుబాటు కావాలనే అహంకారపు వైఖరిని అవలంబించేవారే వర్క్‌ప్లేస్‌లో రాజకీయాల్ని నడిపిస్తుం టారు. వీరిలో ఎక్కువమంది పై పదవుల కోసం ప్రయత్నించేవారో, తమ ఈగోలను సంతృప్తిపరచుకోవడానికి యత్నించేవారో అయివుంటారు. ఇంకొందరైతే భయంతోనో, పిరికితనం తోనో, తామెక్కడ ఇరుక్కుంటామోననే సందేహాలతోనో తప్పుడు ప్రచారాలకు పాల్పడుతుంటారు. వీరి మాయా ప్రపంచంలో పడే ఉద్యోగులు ఉద్యోగ జీవితాల్ని నాశనం చేసుకుంటుంటారు. వీటిని అర్థం చేసుకుని, స్థిరంగా వ్యవహరించేవారు ఉద్యోగ జీవితంలో పైకి ఎదుగుతుంటారు.

ఉద్యోగులకు అభద్రతా భావం (ఇన్‌సెక్యూరిటీ) వున్నప్పుడు, ఆఫీసు వాతావరణం పద్ధతిగా లేనప్పుడు, పారదర్శకత, ఉద్యోగులు ఎదిగే అవకాశాలు లేనప్పుడు … ఖచ్చితంగా ఆ ఆఫీసులోకి రాజకీయాలు ప్రవేశిస్తాయి. ఆఫీసు కూడా కుటుంబం లాంటిదే కాబట్టి, కొన్ని చిన్నచిన్న అంశాలపై మనస్పర్థలు తప్పకుండా వుంటాయి. కానీ, అవి విపరీత స్థాయికి చేరితే మాత్రం ఉద్యోగులు ఒకరికొకరు కీడు తలపెట్టుకునే దుస్థితిని సృష్టిస్తుంటాయి. ఇలాంటి పరిస్థితులను అధిగమించాలంటే … కంపెనీలో మీ నడవడికకు కొన్ని హంగుల్ని అద్దుకోవాలి. అవెలాగో చూద్దాం.

(పూర్తి వ్యాసం కోసం ‘వ‌ర్క్‌ప్లేస్‌లో ఇలా గెల‌వండి’ పుస్త‌కం చ‌ద‌వండి).

————————————————————————

ఈ విలువైన పుస్త‌కాన్ని పొందాలంటే …. 

టైటిల్ః వ‌ర్క్‌ప్లేస్‌లో ఇలా గెల‌వండి. ర‌చ‌యితః సురేశ్ వెలుగూరి. పేజీలుః 192, ధ‌రః రు.199.
ప్రింట్‌ కాపీలు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌ లోని ప్ర‌ముఖ బుక్‌స్టోర్స్ అన్నిచోట్లా ల‌భిస్తాయి.
అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, కోబో, కినిగె వంటి ప్ర‌ముఖ ఈబుక్ స్టోర్స్ నుంచి ఈ పుస్త‌కం ఎల‌క్ట్రానిక్ కాపీలు కొనుక్కోవ‌చ్చు.

హైద‌రాబాద్ న‌గ‌రం వ‌ర‌కూ ఉచితంగా పుస్త‌కాన్ని మీ ఇంటికి అందించే స‌దుపాయం ఏప్రిల్ 10, 2016 నుంచి అందుబాటులోకి వ‌స్తుంది.

amazon-india-logo         Flipkart_logo       kobo_logo_FINALPMS     Kinige_logo_big

ఈ పుస్త‌కంలోని వ్యాసాల ప‌రిచ‌యాన్ని చ‌ద‌వాలంటే ఇక్క‌డ క్లిక్ చేయండి.

గుర్తుంచుకోండి, మీ ఉద్యోగ ప్ర‌దేశంలో మిమ్మ‌ల్ని గెలిపించే కీల‌క స‌మాచార‌మంతా ఈ పుస్త‌కంలో వుంది. ఇది మీ ద‌గ్గ‌రుంటే మీరు నిర్భ‌యంగా, నిరంత‌రాయంగా ప‌నిచేసుకుంటూ వెళ్లిపోవ‌చ్చు. ఏ రంగంలో ప‌నిచేస్తున్నార‌నే దానితో సంబంధం లేకుండా … ప్ర‌తి ఉద్యోగి వ‌ద్ద త‌ప్ప‌క వుండితీరాల్సిన పుస్త‌కం. మీ కాపీని నేడే ఆర్డ‌ర్ చేయండి. ఆల్ ది బెస్ట్‌.

Author’s blog: vmrgsuresh.wordpress.com
Follow Suresh on Facebook & Twitter: vmrgsuresh

మీ ముంద‌డుగు కోసం ఈ బ్లాగ్ …

ఉద్యోగం లేదా వ్యాపారం … కొత్త ఆలోచ‌న‌లు, కొత్త ఆచ‌ర‌ణ విధానాలు … అనేక అంశాల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు తాజా స‌మాచారం అందించ‌డం, మిమ్మ‌ల్ని విజ‌య‌వంతంగా ముందుకు న‌డిపించ‌డానికి ఉప‌యోగ‌ప‌డే స‌మాచారాన్ని ఆర్టిక‌ల్స్ రూపంలో ఈ బ్లాగ్‌లో జ‌త‌చేస్తున్నాం. స‌గ‌టున ఏటా 300 స‌మ‌గ్ర‌మైన వ్యాసాలు ఈ బ్లాగుకు తోడ‌వుతాయి.
 
ఉద్యోగ జీవితంలో ఎదుర‌య్యే అనుభ‌వాలు, ఒత్తిళ్లు, వాటిని అధిగ‌మించే మార్గాలు, వ‌ర్క్‌ప్లేస్ వాతావ‌ర‌ణాల‌ను స‌మ‌న్వ‌యం చేసుకోవ‌డం, వ్యాపారంలో ఎదుర‌య్యే కాంప్లికేష‌న్ల‌ను ఎదుర్కొని ముందుకు న‌డిపించ‌డం, ఆధునిక వ్యాపార సూత్రాల‌ను అర్థం చేసుకోవ‌డం, స్టార్ట‌ప్‌ల ఏర్పాటు – నిర్వ‌హ‌ణ‌, పెట్టుబ‌డులు, నిధుల స‌మీక‌ర‌ణ‌, ప్ర‌భుత్వ లైసెన్సులు మొద‌లైన అనేక‌ అంశాల ఆధారంగా ఈ వ్యాసాలు విడుద‌ల‌వుతాయి. ఆస‌క్తి వున్నవారు బ్లాగ్ సంద‌ర్శించి ఫాలో ఆప్ష‌న్‌ను ఎంచుకోవ‌చ్చు. వ‌ర్క్‌ప్లేస్ మేనేజ్‌మెంట్ అంశాల‌పై విఎమ్ఆర్‌జి ఇంట‌ర్నేష‌న‌ల్ ప్ర‌చురించే పుస్త‌కాల స‌మాచారం కూడా ఈ బ్లాగులో ల‌భిస్తుంది. థాంక్ యూ.

Contact us

Contact Us

You can reach us at publications at vmrgmedia dot com. We generally get back to you within 24 hours.

You can call our Help Line number 91 040 65572593 from 10.00 AM – 6.30 PM IST in all working days.

మీ బాస్ మిమ్మ‌ల్ని శ‌హ‌బాష్ అనాలంటే ? …

boss

ఆఫీస్‌ అంటేనే పదిమంది కలిసి ఉమ్మడిగా అవుట్‌పుట్‌ ఇచ్చే చోటు. ఇక్కడ ఎవరి పని బాధ్యతలు వారికి అప్పగించబడతాయి. వాటిని వారెలా నిర్వహించాలో ఖచ్చితమైన ఆదేశాలుంటాయి. ఒక ఇష్యూ ఎంత పెద్దదైనా, అటు మేనేజ్‌మెంట్‌ వైపు నుంచి కావచ్చు; ఇటు ఉద్యోగి వైపు నుంచి కావచ్చు, ఖచ్చితంగా ఒక పరిష్కారం మాత్రం లభిస్తుంది. ఒక్కోసారి బాస్‌ మంచి సూచనలివ్వొచ్చు, ఇంకోసారి ఒక సాధారణ ఉద్యోగి మంచి సలహా ఇవ్వొచ్చు, కానీ అంతిమంగా అవుట్‌పుట్‌ మాత్రం ఆ టీమ్‌ నుంచే వస్తుంది. టీమ్‌ ప్రయోజనాలు ప్రాజెక్టుకు, తద్వారా కంపెనీకే లభిస్తాయి. సో, అల్టిమేట్‌గా అందరూ గెలిచినట్టే. ఎప్పుడైతే మనం ఈ ‘ఉమ్మడి లక్ష్యం’ అనే పదాన్ని మర్చిపోతామో, అప్పుడు ఉద్యోగిగా మన బాధ్యతల్ని మనం విస్మరిస్తున్నట్టే లెక్క.

నాగరికతకు మూలాలు ఏర్పడక ముందునాటి నుంచీ మనిషి సమూహాల్లోనే జీవించేవాడని, ఒంటరిగా బతకడానికి ఆసక్తి చూపేవాడు కాదని మానవశాస్త్రం (ఆంత్రోపాలజీ) చెప్తుంది. ఒకరిద్దరుగా కాక, గుంపులుగా వెళ్లి వేటాడేవారని, సామూహికంగా ఆహారాన్ని పంచుకుతినేవారని కూడా చరిత్ర చెప్తుంది. ఇంకా, శత్రువుల నుంచి రక్షించుకోవడం, పంటలు పండించుకోవడం, ఇళ్లు నిర్మించుకోవడం, వంట, పిల్లల ఆలనపాలన, సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం, ఇలా అన్ని లక్ష్యాల్నీ ఐక్యంగా వుండి, ఉమ్మడిగా సాధించుకోవడం వల్లనే నాగరికత విలసిల్లింది.

వ్యవసాయం ఊహక్కూడా అందని రోజుల్లోనే, లిపి కూడా పుట్టని రోజుల్లోనే ప్రాచీన మానవులు తమ బాధ్యతల్ని అర్థవంతంగా పంచుకునిమరీ నిర్వహించుకున్నారు. ఆశించిన లక్ష్యం పూర్తికావడానికి తమలోనుంచే చురుకైనవారిని నాయకులుగా ఎన్నుకున్నారు. హెచ్‌.జె.స్కాపర్ట్‌ అనే ఆంత్రోపాలజీ నిపుణుడు ఈ సత్యాన్నే వివరిస్తూ, ‘బతుకుతెరువును ఉమ్మడి ప్రయోజనాల్లో భాగం చేయడం వల్ల మానవ నాగరికత అతివేగంగా జరిగింది’ అని రాశారు. ఈ స్వాభావిక ధర్మమే ఇవ్వాళ్టికీ ప్రపంచమంతా పరచుకునివుంది. ఇవ్వాళ్టి ఉద్యోగులక్కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది.

ఇవ్వాళ్టి మన టాపిక్‌ ఉద్యోగుల గురించి కాబట్టి మన పైఅధికారిని ‘బాస్‌’ అని వ్యవహరించుకుందాం. మంచి శక్తిసామర్థ్యాలుండి, ప్రభావవంతంగా పనిచేయగలవారు బాస్‌లవుతారు. రాజకీయాలు, బంధుప్రీతి, ఇలాంటి చాలా కారణాల ద్వారా బాస్‌లయ్యేవాళ్లు కూడా కోకొల్లలుగా వుంటారు. కానీ, ఇవ్వాళ్టి మన చర్చ దానిగురించి కాదు. బాస్‌ అంటే ”మీతోపాటు కలిసి పనిచేస్తూ, మీ పనిని సమన్వయం చేసుకునేవాడు మాత్రమే” అనే వాస్తవార్థంలో మాత్రమే చూడాలి. నిర్ణయాలు తీసుకునే అదనపు అధికారం మాత్రమే బాస్‌కి వుంటుంది. కంపెనీ పనితీరు మీద వ్యతిరేక ప్రభావం చూపే పరిస్థితి ఎదురైనప్పుడు బాస్‌ కూడా ఏకాకే అని గుర్తుంచుకోవాలి.

మీ బాస్‌ మీ పనితీరును గుర్తించడం ఖచ్చితంగా ముఖ్యమైన అంశమే. మీ కంపెనీ సీఈఓ లేదా మేనేజింగ్‌ డైరెక్టర్ల స్థాయి వదిలెయ్యండి. మీ పనితీరును ఎప్పటికప్పుడు అంచనావేస్తూ, మీమీద కంపెనీకి ఒక ఇంప్రెషన్‌ నోట్‌ ఇచ్చే మీ పైఅధికారి వరకూ మాత్రమే పరిమితమవండి. బాసిజమ్‌, స్టాఫ్‌ సిండ్రోమ్‌ … ఇలాంటి విషయాలన్నీ పక్కన పెట్టండి. నిజానికి వర్క్‌ప్లేస్‌లో కనిపించీ కనిపించకుండా ‘ఎమోషనల్‌ ఇంటలిజెన్స్‌’ బాగా పనిచేస్తుంటుంది. ఇదే చాలా సందర్భాల్లో మిమ్మల్ని గెలిపిస్తుంటుంది.

మీ బాస్‌ మీ పనితీరుతో సంతృప్తి చెందడానికి కింది అంశాలు ఉపయోగపడొచ్చు. 

(పూర్తి వ్యాసం కోసం ‘వ‌ర్క్‌ప్లేస్‌లో ఇలా గెల‌వండి’ పుస్త‌కం చ‌ద‌వండి).

————————————————————————

ఈ విలువైన పుస్త‌కాన్ని పొందాలంటే …. 

టైటిల్ః వ‌ర్క్‌ప్లేస్‌లో ఇలా గెల‌వండి. ర‌చ‌యితః సురేశ్ వెలుగూరి. పేజీలుః 192, ధ‌రః రు.199.
ప్రింట్‌ కాపీలు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌ లోని ప్ర‌ముఖ బుక్‌స్టోర్స్ అన్నిచోట్లా ల‌భిస్తాయి.
అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, కోబో, కినిగె వంటి ప్ర‌ముఖ ఈబుక్ స్టోర్స్ నుంచి ఈ పుస్త‌కం ఎల‌క్ట్రానిక్ కాపీలు కొనుక్కోవ‌చ్చు.

హైద‌రాబాద్ న‌గ‌రం వ‌ర‌కూ ఉచితంగా పుస్త‌కాన్ని మీ ఇంటికి అందించే స‌దుపాయం ఏప్రిల్ 1, 2016 నుంచి అందుబాటులోకి వ‌స్తుంది.

amazon-india-logo         Flipkart_logo       kobo_logo_FINALPMS     Kinige_logo_big

ఈ పుస్త‌కంలోని వ్యాసాల ప‌రిచ‌యాన్ని చ‌ద‌వాలంటే ఇక్క‌డ క్లిక్ చేయండి.

గుర్తుంచుకోండి, మీ ఉద్యోగ ప్ర‌దేశంలో మిమ్మ‌ల్ని గెలిపించే కీల‌క స‌మాచార‌మంతా ఈ పుస్త‌కంలో వుంది. ఇది మీ ద‌గ్గ‌రుంటే మీరు నిర్భ‌యంగా, నిరంత‌రాయంగా ప‌నిచేసుకుంటూ వెళ్లిపోవ‌చ్చు. ఏ రంగంలో ప‌నిచేస్తున్నార‌నే దానితో సంబంధం లేకుండా … ప్ర‌తి ఉద్యోగి వ‌ద్ద త‌ప్ప‌క వుండితీరాల్సిన పుస్త‌కం. మీ కాపీని నేడే ఆర్డ‌ర్ చేయండి. ఆల్ ది బెస్ట్‌.

Author’s blog: vmrgsuresh.wordpress.com
Follow Suresh on Facebook & Twitter: vmrgsuresh

వ‌ర్క్‌ప్లేస్‌లో ఇలా గెల‌వండి – ఈ పుస్త‌కం ఎందుకు చ‌ద‌వాలి?

WP Cover-Final_Front_WEB‘వ‌ర్క్‌ప్లేస్‌లో ఇలా గెల‌వండి’ పుస్త‌కంలో జ‌త‌చేసిన వ్యాసాల ఇండెక్స్ ఇది. ప్ర‌తి వ్యాసానికీ వివ‌ర‌ణ కూడా చద‌వొచ్చు. 

1) కొత్త ఉద్యోగానికి వెళ్లేముందు 
కొత్త‌గా ఉద్యోగంలో చేరే ఉద్యోగి ఆఫీసుకు వెళ్లే ముందే తెలుసుకోవాల్సిన ప‌లు అంశాలు, వ్య‌వ‌హ‌రించాల్సిన ప‌ద్ధ‌తుల‌పై ఈ వ్యాసం స‌మాచార‌మిస్తుంది.

2) ఆఫీసును ఎలా అర్థం చేసుకోవాలి? 
భిన్న మ‌న‌స్త‌త్వాలు, వ్య‌వ‌హార శైలులు వుండే వ‌ర్క్‌ప్లేస్‌ను విధి నిర్వ‌హ‌ణ కోణం నుంచి, వ్య‌క్తిగ‌త కోణం నుంచి ఎలా అర్థం చేసుకోవాలో ఈ వ్యాసం స‌వివ‌రంగా సూచిస్తుంది.

3) ఉద్యోగం తొలి రోజుల్లో … 
క‌ష్ట‌ప‌డి చ‌దివి, ఇంట‌ర్‌వ్యూల‌కు ప్రిపేర్ కావ‌డం, అక్క‌డ గెలిచి ఉద్యోగం సాధించ‌డం అంతా ఒక ఎత్తు. ఉద్యోగాన్ని నిల‌బెట్టుకోవ‌డానికి వ్య‌వ‌హ‌రించే శైలి ఇంకో ఎత్తు. ఇందుకోసం అనుస‌రించాల్సిన ప‌ద్ధ‌తుల‌పై ఈ వ్యాసంలో 28 పాయింట్లలో విస్తృత‌మైన స‌మాచారం ల‌భిస్తుంది.

4) పైనుంచి కిందికి, కింది నుంచి పైకి
ఉద్యోగంలో హైయ‌రార్కీని ఎలా అర్థం చేసుకోవాలి, వ‌ర్క్‌ప్లేస్‌ను ఎలా ఉప‌యోగించుకోవాలో ఈ వ్యాసంలో తెలుసుకోవ‌చ్చు.

5) ఉద్యోగం – మీ కోణం నుంచి ! 
ఉద్యోగాన్ని మీ కోణం నుంచి ఎలా అర్థం చేసుకోవాలి, మీ సామ‌ర్థ్యాల‌ను రుజువు చేసుకునే ప్లాట్‌ఫారంగా దీనినెలా రూపొందించుకోవాలో ఈ వ్యాసం ద్వారా తెలుసుకోవ‌చ్చు.

6) ఉద్యోగం – కంపెనీ కోణం నుంచి ! 
ఉద్యోగాన్ని కంపెనీ కోణం నుంచి ఎలా అర్థం చేసుకోవాలి, ఒక కంపెనీ ఏర్పాటు వెనుక వుండే సాధ‌క బాధ‌కాల గురించి ఈ వ్యాసం మీకు స‌మాచార‌మిస్తుంది. కంపెనీని కాపాడుకోవ‌డం ద్వారా మీ ఉద్యోగావ‌కాశాల‌ను ఎలా మెరుగుపర‌చుకోవ‌చ్చో ఈ వ్యాసంలో తెలుసుకోవ‌చ్చు.

7) జస్ట్‌కీ, బెస్ట్‌కీ మధ్య 
ప‌నిచేసేచోట ప్ర‌తిభ‌ను గుర్తించ‌డానికి అనేక పారామీట‌ర్లుంటాయి. వీటి ప్ర‌కారం మీరు బెస్ట్ ఉద్యోగిగా వుంటారా, జ‌స్ట్ ఉద్యోగిగా వుంటారో నిర్ణ‌యించుకోవ‌డానికి ఈ వ్యాసంలోని స‌మాచారం మీకు ఉప‌యోగ‌ప‌డుతుంది.

8) తొలి రోజుల అనుభవాలు రికార్డు చేయండి 
ఉద్యోగంలో చేరిన తొలిరోజుల్లో ఎవ‌రికివారు కొన్ని స్వీయ‌ ప్ర‌మాణాల‌ను నిర్దేశించుకోవ‌డం ద్వారా వ‌ర్క్‌ప్లేస్‌లో ఎలా గెలుపు సాధించాలో ఈ భాగంలో వివ‌రంగా తెలుసుకోవ‌చ్చు. మీ అనుభ‌వాల‌ను భ‌విష్య‌త్ కోసం ఉప‌యోగించుకోగ‌ల ప‌లు మార్గాల‌ను ఈ వ్యాసం సూచిస్తుంది.

9) మీ బాస్‌ మిమ్మల్ని శహభాష్‌ అనాలంటే …? 
ఆఫీస్ అంటేనే ప‌దిమంది క‌లిసి ఉమ్మ‌డిగా అవుట్‌పుట్ ఇచ్చే చోటు. కంపెనీ మీకిచ్చిన బాధ్య‌త‌లు, ఆదేశాల‌ను స‌మ‌ర్థ‌వంతంగా పాటించ‌డం, మంచి ఫ‌లితాల‌ను సాధించ‌డం ఎలాగో ఈ వ్యాసం మీకు స‌మ‌గ్రంగా వివ‌రిస్తుంది. మీ బాస్ మిమ్మ‌ల్ని శ‌హ‌భాష్ అనేలా మిమ్మ‌ల్ని మీరు ఎలా రూపొందించుకోవాలో ప‌ది పాయింట్ల‌లో విపులంగా చ‌ద‌వండి.

10) స్థిరమైన ఉద్యోగాలకు త్రిసూత్రాలు 
ఉద్యోగం చేయ‌డం వేరు, దానిని స్థిరంగా వుండేలా కాపాడుకోవ‌డం వేరు. మీ ఉద్యోగాన్ని మీరు స్థిరంగా కొన‌సాగించ‌డానికి ఉప‌యోగ‌ప‌డే మూడు (త్రి)సూత్రాల‌ను ఈ వ్యాసం ద్వారా తెలుసుకోవ‌చ్చు.

11) ఈ ఆరు లక్షణాలూ వుంటే మీరే సాలిడ్‌ వర్కర్‌ 
వాడు సాలిడ్‌రా – ఈ కామెంట్ చాలా ఆఫీసుల్లో వింటుంటాం. ఈ పొగ‌డ్త‌ను ద‌క్కించుకున్న మ‌నిషికి స‌బ్జెక్ట్‌, ప‌ని ప‌ద్ధ‌తులు, ఇత‌ర అన్ని విష‌యాల్లో మంచి ప‌ట్టుంద‌ని అర్థం. మీరు కూడా ఇలా సాలిడ్ వ‌ర్క‌ర్‌గా మార‌డానికి మీకుండాల్సిన ఆరు ల‌క్ష‌ణాల‌ను ఈ వ్యాసం తెలియ‌జేస్తుంది.

12) ‘వినడం’ ప్రాధాన్యత గుర్తించండి 
వినే ల‌క్ష‌ణం వున్న‌వాడు పైకొస్తాడు – పెద్ద‌వారి నోటినుంచి ఈ మాట చాలాసార్లు వినివుంటాం క‌దా! ఈ ‘వినే ల‌క్ష‌ణం’ వ‌ర్క్‌ప్లేస్‌లో మీకెంత బాగా ఉప‌యోగ‌ప‌డుతుందో ఈ వ్యాసం చ‌దివి తెలుసుకోవ‌చ్చు.

13) ఆఫీసు రూల్స్‌ను అర్థం చేసుకోండి 
వ‌ర్క్‌ప్లేస్‌లో గెల‌వాలంటే మీ ఆఫీసు రూల్స్ & రెగ్యులేష‌న్స్‌ను అర్థం చేసుకోవ‌డం అతి ముఖ్యం. ప‌నిచేసే ప్ర‌తిచోటా మీ ముద్ర స్ప‌ష్టంగా క‌నిపించాలంటే మీ ఆఫీసును స్ప‌ష్టంగా అర్థం చేసుకోవ‌డం ఒక్క‌టే మార్గం. ఇందుకు ప‌నికొచ్చే ప‌లు అంశాలు ఈ వ్యాసం నుంచి తెలుసుకోవ‌చ్చు.

14) హెచ్‌ఆర్‌ టీమ్‌తో మెరుగైన సంబంధాలు
మీ ఉద్యోగ వ్య‌వ‌హారాల్ని నిర్వ‌హించే మాన‌వ‌వ‌న‌రుల విభాగంతో మంచి ఉద్యోగ సంబంధాలు ఎలా ఏర్ప‌ర‌చుకోవాలో, నిర్వ‌హించుకోవాలో ఈ వ్యాసంలో చ‌ద‌వండి.

15) అవకాశాలు సృష్టించుకుంటేనే టాప్‌లో నిలుస్తారు
వ‌ర్క్‌ప్లేస్‌లో మీకంటూ స‌రికొత్త అవ‌కాశాల్ని ఎలా సృష్టించుకోవాలి, నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల‌తో ఎలా పైకి ఎద‌గాలో సూచించే పూర్తి స‌మాచారాన్ని ఈ వ్యాసం మీకందిస్తుంది.

16) ఆఫీసు రాజకీయాల్ని ఎదుర్కోవడం ఎలా? 
ఆఫీసు రాజ‌కీయాల‌ను అర్థం చేసుకోవ‌డం అంటే – త‌మ బ‌లాలు బ‌ల‌హీన‌త‌ల‌ను నెగ‌టివ్ కోణం నుంచి ఉప‌యోగించుకునే మ‌నుషుల్ని అర్థం చేసుకోవ‌డం అని చెప్పొచ్చు.వీటిని ఎలా ఎదుర్కోవాలి, ఉద్యోగ జీవితాన్ని ఎలా సాఫీగా ముందుకు న‌డిపించుకోవాలో ఈ వ్యాసంలో స‌వివ‌రంగా తెలుసుకోవ‌చ్చు.

17) ఉద్యోగ సంబంధాల్లో పరిమితులు
క‌లిసి ప‌నిచేసే చోట ఉద్యోగుల మ‌ధ్య ఎలాంటి సంబంధాలుండాలి, ఉద్యోగ సంబంధాల్లో ప‌రిమితులెలా పాటించాలి మొద‌లైన ప‌లు సున్నిత‌మైన అంశాల‌పై ఈ వ్యాసం మీకు అనేక‌ సూచ‌న‌లు, స‌ల‌హాలు అందిస్తుంది.

18) ఉద్యోగంలో ఒత్తిళ్లను ఇలా అధిగమించండి 
వ‌ర్క్‌ప్లేస్ అంటే ప‌లు ఒత్తిళ్ల‌ను ఎదుర్కోవాల్సివ‌చ్చే స్థ‌ల‌మ‌ని అర్థం చేసుకోవాల్సివ‌స్తోంది. ఒత్తిళ్ల‌ను ఎదుర్కోలేక ఉద్యోగాలు మానేసే ఉద్యోగుల‌నూ చూస్తుంటాం. ఉద్యోగులు అన్నిర‌కాల‌ ఒత్తిళ్ల‌ను విజ‌య‌వంతంగా ఎదుర్కోవ‌డానికి కీల‌కంగా ఉప‌యోగ‌ప‌డే ప‌లు అంశాల‌ను 18 పేజీల ఈ పెద్ద అధ్యాయంలో వివ‌రంగా చ‌ద‌వండి. (ర‌చ‌యిత ప‌ర్స‌న‌ల్ బ్లాగ్‌లో ఈ వ్యాసాన్ని ఆరు వారాల‌పాటు వుంచితే, 2.80 ల‌క్ష‌ల మంది చ‌దివారు).

19) వర్క్‌ప్లేస్‌లో క్యారెక్టర్‌ను కాపాడుకోవడం ఎలా? 
వ‌ర్క్‌ప్లేస్‌లో మీ హుందాత‌నాన్ని కాపాడుకోవ‌డం ద్వారా మీ ఉద్యోగాన్ని స్థిరంగా కొన‌సాగించుకోవ‌డం, స‌హోద్యోగుల మ‌ధ్య మంచి గౌర‌వం పొంద‌డానికి మీ క్యారెక్ట‌ర్ ఎలా ఉప‌యోగ‌ప‌డుతుందో ఈ వ్యాసం తెలియ‌జేస్తుంది.

20) భాష, సంస్కృతుల్ని అడ్డంకులుగా చూడకండి 
ప్ర‌పంచీక‌ర‌ణ (గ్లోబ‌లైజేష‌న్) పుణ్య‌మా అని మారుతున్న కాల‌మాన ప‌రిస్థితుల్లో ఉద్యోగులు వ‌ర్క్‌ప్లేస్‌ల‌లో ఎదుర్కొంటున్న భాష‌, సాంస్కృతిక వైరుధ్యాల‌ను ఎలా అర్థం చేసుకోవాలి, మీ కెరియ‌ర్‌ను బ‌లోపేతం చేసుకోవ‌డానికి వీటిని ఎలా ఉప‌యోగించుకోవాలో ప‌లు సూచ‌న‌లను ఈ భాగం నుంచి పొంద‌వ‌చ్చు.

21) వర్క్‌ప్లేస్‌లో వైరుధ్యాలను ఎదుర్కోవడమెలా? 
భిన్న మ‌న‌స్త‌త్వాలు, ప‌నిచేసే ప‌ద్ధ‌తులు క‌లిగివుండే వ‌ర్క్‌ప్లేస్‌లో వైరుధ్యాల‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కోవ‌డం ద్వారా మీ బాధ్య‌త‌లు మీరు స‌క్ర‌మంగా ఎలా పూర్తిచేసుకోవాలో ఈ భాగంలో చ‌ద‌వండి.

22) సోషల్‌ మీడియా పరిమితుల్ని గుర్తించండి 
సోష‌ల్ మీడియా ప్ర‌భావం విస్తృతంగా పెరుగుతున్న ఈ రోజుల్లో మీ ఉద్యోగ బాధ్య‌త‌ల‌కు దీనినుంచి ముప్పు రాకుండా జాగ్ర‌త్త‌ప‌డేందుకు ఈ వ్యాసం మీకెంతో సాయ‌ప‌డుతుంది.

23) నలుగురిలో మిమ్మల్ని గెలిపించే ‘ఓపెన్‌ కమ్యూనికేషన్‌’ 
వ‌ర్క్‌ప్లేస్‌లో ఓపెన్ కమ్యూనికేష‌న్ విధానాలు మీకు ఎంత మేలు చేస్తాయో ఈ వ్యాసంలో తెలుసుకోండి. ప‌లు ఓపెన్ క‌మ్యూనికేష‌న్ విధానాలు, వాటిని పాటించే ప‌ద్ధ‌తుల్ని కూడా చ‌ద‌వండి.

24) మీ ఉద్యోగం పోగొట్టగల 15 కారణాలు 
ఉద్యోగం నిల‌బెట్టుకోవ‌డానికి చాలా ప‌ద్ధ‌తులుంటాయి. పోగొట్ట‌డానికి ఉప‌యోగ‌ప‌డే కార‌ణాలేముంటాయి? ఈ వ్యాసంలో మీరు ఉద్యోగం పోగొట్టుకోవ‌డానికి ఉప‌యోగ‌ప‌డే 15 కార‌ణాల‌ను వివ‌రంగా చ‌ద‌వండి. వీటిని జాగ్ర‌త్త‌గా మేనేజ్ చేయ‌డం ద్వారా మీ ఉద్యోగాన్ని ఎలా కాపాడుకోవాలో మీరే నిర్ణ‌యించుకోవ‌చ్చు. (ఈ వ్యాసాన్ని కూడా ఈ పుస్త‌క ర‌చ‌యిత బ్లాగ్‌లో వుంచితే, ఆరు వారాల్లో 3.2 ల‌క్ష‌ల మంది చ‌దివారు).

25) మీకో మెంటర్‌ కావాలిప్పుడు !! 
వ‌ర్క్‌ప్లేస్‌లో బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించ‌డం, మీ త‌ప్పొప్పుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు బేరీజు వేసుకోవ‌డం కోసం మీకో మెంట‌ర్ వుండ‌డం త‌ప్ప‌నిస‌రి. మెంట‌ర్‌ను ఎలా ఎంచుకోవాలి, మెంట‌రింగ్ వ‌ల్ల క‌లిగే అనేక ప్ర‌యోజ‌నాల గురించి ఈ వ్యాసంలో వివ‌రంగా చ‌ద‌వండి.

26) వర్క్‌ప్లేస్‌లో మహిళలు రాణించడానికి …
ఆకాశంలో స‌గం, అన్నింటా స‌గం అని విజ‌య‌బావుటాను ఎగరేస్తున్న మ‌హిళ‌లు వ‌ర్క్‌ప్లేస్‌లో మంచి అవ‌కాశాలు పొంద‌డం, ఉద్యోగాల్లో రాణించ‌డానికి ఈ వ్యాసం విలువైన సూచ‌న‌ల‌ను అందిస్తుంది.

27) వర్క్‌ప్లేస్‌లో మహిళలకు రక్షణపై చట్టాలు 
ఉద్యోగాలు చేస్తున్న మ‌హిళ‌లకు వ‌ర్క్‌ప్లేస్‌ల‌లో భ‌ద్ర‌త క‌ల్పించే అంశాల‌పై ఈ వ్యాసం కీల‌క‌మైన స‌మాచారాన్నిస్తుంది. మీ వ‌ర్క్‌ప్లేస్‌లో మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌కు ఎటువంటి అవ‌కాశాలుండాలో తెలుసుకోవ‌డానికి, హ‌క్కుగా వాటిని ఇంప్లిమెంట్ చేయించుకోవ‌డానికి కూడా ఈ వ్యాసం ప‌నికొస్తుంది.

28) వర్క్‌ప్లేస్‌లో మహిళల భద్రత – విశాఖ గైడ్‌లైన్స్‌ 
మ‌హిళా ఉద్యోగుల భ‌ద్ర‌త‌కు సంబంధించి సుప్రీంకోర్టు విడుద‌ల చేసిన మార్గ‌ద‌ర్శ‌కాలు చ‌ద‌వండి.

29) ఉద్యోగులకు న్యాయపరమైన సాయం కావాలంటే? 
ఏ రంగంలో ప‌నిచేస్తున్న ఉద్యోగుల‌కైనా తమ విధుల నిర్వ‌హ‌ణ‌, ప్ర‌భుత్వ చ‌ట్టాలు, ఇత‌ర అనేక అంశాల‌పై న్యాయ‌ప‌ర‌మైన స‌మాచారం అవ‌స‌ర‌మ‌వుతుంటుంది. వీటితోపాటు ఉద్యోగిగా వ‌ర్క్‌ప్లేస్‌లో వ్య‌క్తిగ‌తంగా కూడా న్యాయ‌సూచ‌న‌ల అవ‌స‌రం ఏర్ప‌డుతుంటుంది. ఇలాంటి సంద‌ర్భాల్లో ఎలా వ్య‌వ‌హ‌రించాలో ఈ వ్యాసం తెలియ‌జేస్తుంది.

30) ఉద్యోగం మారాలనుకుంటున్నారా?
ఉద్యోగం మార‌డ‌మంటే జీవితంలో ఇంకో మెట్టు ఎక్క‌డం. అయితే, ఉద్యోగం ఎందుకు మారాలి, మారాల‌నే నిర్ణ‌యం వెనుక ఎలాంటి కార‌ణాలుండాలి వంటి ప‌లు అంశాల్ని వాస్త‌విక కోణం నుంచి తెలుసుకోండి.

31) ఉద్యోగం మారే ముందు చేయాల్సిన పనులివీ! 
ఉద్యోగం మారాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌డం సుల‌భ‌మే! నిర్ణ‌యం త‌రువాత కంపెనీతో ఎలా వ్య‌వ‌హ‌రించాలో ఈ వ్యాసంలో చ‌ద‌వండి.

32) భార్యాభర్తలు – ఆఫీసు బంధాలు
ఉద్యోగాలు చేస్తున్న భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య ఎలాంటి స‌ఖ్య‌త వుంటే వారి ఉద్యోగ జీవితం, కుటుంబ జీవితం రెండూ సుఖ‌ప్ర‌దంగా సాగుతాయో ఈ వ్యాసం వివ‌రిస్తుంది. (ఈ వ్యాసాన్ని కూడా ఆరు వారాల‌పాటు ర‌చ‌యిత సొంత బ్లాగ్‌లో వుంచ‌గా, 1.28 ల‌క్ష‌ల మంది చ‌దివారు).

33) సంపాదనకు ఇలా సేఫ్టీ ఇవ్వండి 
క‌ష్ట‌ప‌డి ఉద్యోగాలు చేసి సంపాదించే డ‌బ్బుకు ఎలాంటి ర‌క్ష‌ణ ఇవ్వాలి, మీ భ‌విష్య‌త్తుకు అనుగుణంగా వ్య‌వ‌హ‌రించాల్సిన ఆర్థిక న‌మూనాల గురించి ఈ వ్యాసం మీకు వివ‌రిస్తుంది.

34) ఆఫీసులో వినోదం, విజ్ఞానం అవకాశాలు 
ఉద్యోగం ఆడుతూ పాడుతూ చేసేది కాదు. కానీ, సీరియ‌స్‌నెస్ పోగొట్టుకోకుండానే మీ వ‌ర్క్‌ప్లేస్‌లో ఫ‌న్ & లెర్న్ విధానాలు ఎలా పాటించాలో ఈ వ్యాసం వివ‌రిస్తుంది.

35) టోస్ట్‌మాస్టర్స్‌ – ప్రతిభను మరింత సానబెడతారు! 
ప‌బ్లిక్ స్పీకింగ్ అంశంపై ప్ర‌పంచ‌వ్యాప్తంగా కొన్ని కోట్ల‌మందికి ఆలంబ‌న‌గా నిలుస్తున్న టోస్ట్‌మాస్ట‌ర్స్ గురించి ఈ వ్యాసంలో చ‌ద‌వండి. మిమ్మ‌ల్ని మీరు ఒక మెరుగైన క‌మ్యూనికేట‌ర్‌గా రూపొందించుకోవ‌డం ద్వారా ఉద్యోగ జీవితంలో ఎలా గెల‌వాలో ఈ వ్యాసం ప‌లు సూచ‌న‌లిస్తుంది.

36) మీరూ ఎంటర్‌ప్రెన్యూర్‌ కావచ్చు … ఇలా! 
కొన్నేళ్ల‌పాటు ఉద్యోగాలు చేసిన త‌ర్వాత ఎంట‌ర్‌ప్రెన్యూర్‌గా మారాల‌నే ఆశ‌, ఆస‌క్తి చాలామందికి వుంటాయి. వీరికి ప్రోత్సాహాన్నివ్వ‌డంతోపాటు ఎంట‌ర్‌ప్రెన్యూర్‌షిప్‌కి వున్న అవ‌కాశాలు, వ్య‌వ‌హ‌రించాల్సిన ప‌ద్ధ‌తుల గురించి ఈ వ్యాసం ప్ర‌భావ‌వంత‌మైన స‌మాచారాన్నిస్తుంది.

పైన పేర్కొన్న అంశాల‌తోపాటు – ఉద్యోగం చేస్తూనే చ‌దువుకునే ప‌ద్ధ‌తులు, వ‌ర్క్‌ప్లేస్‌కి అనుగుణంగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌డానికి ఉప‌యోగ‌ప‌డే అలైవ‌మ్ ప‌ద్ధ‌తి మొద‌లైన ప‌లు అంశాల‌పై కూడా ఈ పుస్త‌కంలో మీకు విస్తృత‌మైన స‌మాచారాన్ని అందిస్తుంది.

————————————————————————-

ఈ విలువైన పుస్త‌కాన్ని పొందాలంటే …. 

టైటిల్ః వ‌ర్క్‌ప్లేస్‌లో ఇలా గెల‌వండి. ర‌చ‌యితః సురేశ్ వెలుగూరి. పేజీలుః 192, ధ‌రః రు.199.
ప్రింట్‌ కాపీలు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌ లోని ప్ర‌ముఖ బుక్‌స్టోర్స్ అన్నిచోట్లా ల‌భిస్తాయి.
అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, కోబో, కినిగె వంటి ప్ర‌ముఖ ఈబుక్ స్టోర్స్ నుంచి ఈ పుస్త‌కం ఎల‌క్ట్రానిక్ కాపీలు కొనుక్కోవ‌చ్చు.

హైద‌రాబాద్ న‌గ‌రం వ‌ర‌కూ ఉచితంగా పుస్త‌కాన్ని మీ ఇంటికి అందించే స‌దుపాయం ఏప్రిల్ 1, 2016 నుంచి అందుబాటులోకి వ‌స్తుంది.

amazon-india-logo         Flipkart_logo       kobo_logo_FINALPMS     Kinige_logo_big

ఈ పుస్త‌కంలోని వ్యాసాల ప‌రిచ‌యాన్ని చ‌ద‌వాలంటే ఇక్క‌డ క్లిక్ చేయండి.

గుర్తుంచుకోండి, మీ ఉద్యోగ ప్ర‌దేశంలో మిమ్మ‌ల్ని గెలిపించే కీల‌క స‌మాచార‌మంతా ఈ పుస్త‌కంలో వుంది. ఇది మీ ద‌గ్గ‌రుంటే మీరు నిర్భ‌యంగా, నిరంత‌రాయంగా ప‌నిచేసుకుంటూ వెళ్లిపోవ‌చ్చు. ఏ రంగంలో ప‌నిచేస్తున్నార‌నే దానితో సంబంధం లేకుండా … ప్ర‌తి ఉద్యోగి వ‌ద్ద త‌ప్ప‌క వుండితీరాల్సిన పుస్త‌కం. మీ కాపీని నేడే ఆర్డ‌ర్ చేయండి. ఆల్ ది బెస్ట్‌.

Author’s blog: vmrgsuresh.wordpress.com
Follow Suresh on Facebook & Twitter: vmrgsuresh

వ‌ర్క్‌ప్లేస్‌లో ఇలా గెల‌వండి – ఎందుకీ పుస్త‌కం?

ఇంట గెలిచి రచ్చ గెలవాలని తెలుగు సామెత. కానీ, ఉద్యోగం విషయంలో ఇది కొంచెం అటూఇటూ అవుతుంటుంది. ఇంట్లో చాలా ఓర్పు, సహనంతో పనులు చక్కబెట్టుకునే చాలామంది ఆఫీసు విషయానికి వచ్చేసరికి డీలా పడిపోతుంటారు. నిజానికి బాధ్యతల్ని ప్రేమించేవాడికి ఆఫీసు రెండో ఇల్లు లాగా కనిపిస్తుందే తప్ప భయాన్ని కల్పించదు.

గత 20 సంవత్సరాలుగా ఒక ఉద్యోగిగా, సర్వీస్‌ ప్రొవైడర్‌గా, ట్రెయినర్‌గా, కన్సల్టెంట్‌గా 200కి పైగా కంపెనీలను, ఉద్యోగులను దగ్గరగా చూశాను, కొన్ని వందల మనస్తత్వాలను దగ్గరగా పరిశీలించాను. ఈ బాధ్యతల్లో ఒకవైపు నన్ను నేనుగా చూసుకుంటూనే, ఇంకోవైపు ఉద్యోగులుగా వారి బాధ్యతల కోణం నుంచి కూడా గమనించడం అలవాటు చేసుకున్నాను. ఫలితంగా అనేక సందర్భాల్లో, అనేక సమస్యల్ని సునాయాసంగా పరిష్కరించుకోగలిగాను. ప్రతి మనిషికీ ఇలాంటి అనుభవాలు నేర్పే పాఠాలు అనేకం వుంటాయి. అయితే, రెండేళ్ల క్రితం ఎదురైన కొన్ని అనుభవాలు ఈ పుస్తకం తీసుకురావడానికి నాకు ప్రేరణనిచ్చాయి.

ఒక స్నేహితుడి చెల్లెలు బెంగుళూరు జయదేవా ప్రాంతంలోని ఒక ఎమ్‌ఎన్‌సీ ఐటీ కంపెనీలో పనిచేస్తోంది. ఒక మధ్యాహ్నం తనని లంచ్‌కి బయటికి తీసుకువెళ్లాను. చాలా ముభావంగా, ముక్తసరిగా వుంది. ఒకటికి నాలుగుసార్లు రెట్టించి అడిగితే కారణం చెప్పింది. కారణం కాదు, కారణాలు చెప్పింది. కంపెనీలో ఆ అమ్మాయికి నెలకి 35 వేల రూపాయల జీతమొస్తోంది. అది వదులుకోలేదు. అలాగని అక్కడున్న పరిస్థితుల్లో ఉద్యోగంలో కొనసాగనూలేదు. తనను తన కోణం నుంచి అర్థం చేసుకోవడానికి చాలాసేపు పట్టింది.

చివర్లో ఒక ప్రశ్నడిగాను. ‘ఈ సమస్య నీకొక్కదానిదేనా?’ అని. అవుననే జవాబు వస్తుందనుకున్నాను. కానీ ఆశ్చర్యంగా, ఆఫీసులో మెజారిటీ స్టాఫ్‌ తనలాగే ఇబ్బంది పడుతున్నారని చెప్పింది. విపరీతమైన రాజకీయాలు, ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్‌, బాసిజమ్‌, ఇంకా చాలా ఇబ్బందులున్నాయని చెప్పింది. తను చెప్పిన ఇంకో కారణం వినగానే నాకు కళ్లలోకి అమాంతం నీళ్లు ఉబికాయి. కొంతమందైతే ఇంటినుంచి తెచ్చుకున్న లంచ్‌ బాక్సులు కూడా తెరవరని, ఆకలి చంపేస్తున్నా, భయంతో పనిచేసుకుంటూపోతారని చెప్పింది.

బెంగుళూరు నుంచి తిరిగొస్తున్నప్పుడు విమానంలో ఒక ఎయిర్‌హోస్టెస్‌ తమ సేవలెలా వున్నాయో తెలపాలని కోరుతూ ఒక సర్వే ఫారాన్ని నాచేతికిచ్చింది. నేను రెగ్యులర్‌గా విమానాల్లో ప్రయాణించేవాడిని కాదని, నా అభిప్రాయాలు పెద్దగా ఉపయోగపడకపోవచ్చని ఆమెకి చెప్పాను. ఆ అమ్మాయి మాత్రం ఇది కంపల్సరీ సర్‌ అంది. ఫారం పూర్తిచేస్తూ ఆమెవైపు చూశాను. తన చేతులు బిర్రబిగుసుకుపోయివున్నాయి. కస్టమర్‌ రివ్యూలు ఉద్యోగుల జీవితాల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయో అర్థమైంది. పాజిటివ్‌గా ఫారాన్ని పూర్తిచేసి ఆమెకిచ్చాను. ఆమె ఊపిరి పీల్చుకుంటూ నవ్వుముఖంతో వెళ్లిపోయింది. నా ముందుసీట్లో కూర్చున్న వ్యక్తి దగ్గరికి వెళ్లగానే మళ్లీ ఆమె చేతులు బిగుసుకుపోవడం, మనిషి వర్టికల్‌గా స్టిఫ్‌ అయిపోవడం గమనించాను.

ఇలాంటిదే మరో అనుభవం తణుకులో ఎదురైంది. ఒక పరిశ్రమకి సంబంధించిన టెక్నికల్‌ కంటెంట్‌ని ఆన్‌సైట్‌ రివ్యూ చేయడానికి వెళ్లాను. ఫైనల్‌ అంటూ వారిచ్చిన కంటెంట్‌ చూస్తే అత్యంత పేలవంగా వుంది. కనీస స్టాండర్డ్స్‌ కూడా లేవు. అదే విషయం కంటెంట్‌ రాసిన ఉద్యోగులిద్దరికీ చెప్పాను. వాళ్లిద్దరూ భయంగా ముఖాముఖాలు చూసుకుంటూ, నిజమేనని ఒప్పుకున్నారు. వాళ్లతో సంభాషణ ద్వారా నాకర్థమైందేమిటంటే – కంటెంట్‌ గురించి వారికి పరవాలేదనే స్థాయిలో తెలుసు. కానీ ఇంగ్లీష్‌ భాష మీద పట్టు లేకపోవడం, కంటెంట్‌ రాసే పద్ధతులు తెలియకపోవడం, పైగా తెలుసుకోవడానికి ప్రయత్నించకపోవడం వల్ల తమ బాధ్యతల్లో విఫలమయ్యారు.

ఇక కంపెనీ కోణం నుంచి చూస్తే … సంస్థ దాదాపు ఏడు నెలలపాటు వారికి మరే బాధ్యతలూ లేకుండా, కేవలం కంటెంట్‌ రాసే ఒక్క బాధ్యతను మాత్రమే అప్పజెప్పింది. తణుకు లాంటి చిన్న పట్టణంలో నెలకి 25 వేల రూపాయల జీతం ఇవ్వడం చిన్న విషయమేమీ కాదు. మూడున్నర లక్షల రూపాయల ఖర్చు, ఏడు నెలల విలువైన సమయం వృధా అయిందనే బాధ కంపెనీకి కూడా వుంటుంది. కంటెంట్‌ రాయడం తమకు చేతకాదని మొదటే ఆ ఉద్యోగులిద్దరూ చెప్పివుంటే కంపెనీ ప్రత్యామ్నాయం ఏదైనా వెతుక్కునివుండేది. కానీ అలా చెప్పకుండా తాము రాయగలమనే హామీని కంపెనీకి ఇచ్చి, ఏడు నెలలపాటు సాగదీయడమంటే అది కంపెనీని మోసం చేయడమే అవుతుంది. ఉద్యోగం పోతుందేమోనన్న భయంతో వారు ఆ పని చేశారు. నాలుగైదు పేజీల కంటెంట్‌ అయితే మేనేజ్‌ చేసేవాడినేమో కానీ, అది 300 పేజీలకి పైగా వుండడంతో నేను వారికి సాయపడలేకపోయాను. ఇలాంటి కొన్ని అనుభవాలను దృష్టిలో వుంచుకుని, కొత్తతరం ఉద్యోగులకు ఇటువంటి అడ్డంకుల్ని ఎదుర్కోగల ఈ తరహా సమాచారం అవసరమనే నమ్మకంతో ఈ పుస్తకాన్ని రూపొందించాను.

ఉద్యోగులుగా మారుతున్న ఇవ్వాళ్టి తరానికి సులభంగా అర్థం కావడం, జ్ఞాపకం వుంచుకోవడం కోసం ఉపయోగపడేలా పాయింట్స్‌ ఫార్ములాను ఎక్కువగా అనుసరించాను. తొలి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం దాకా వరుసగా చదివినా, విడివిడిగా చదివినా కంటెంట్‌ స్పష్టంగా అర్థమయ్యేలా పుస్తకం రూపొందించాను. ఈ కారణంగా అక్కడక్కడా కంటెంట్‌ రిపీట్‌ అయినట్లు అనిపించినా, ఆ అధ్యాయానికి తగిన కంటెంటే బలంగా పొందుపరిచినట్లు అర్థమవుతుంది.

అత్యవసరమైతే తప్ప ఇంగ్లీష్‌ పదాలు వాడని నేను ఈ పుస్తకం విషయంలో కొంత పట్టు సడలించుకోవాల్సివచ్చింది. ఇప్పుడొస్తున్న తరంలో మెజారిటీ శాతం ఇంగ్లీష్‌ మీడియం నుంచి వస్తున్నవారు కావడంతో ఆంగ్లపదాల్ని కాస్త ఎక్కువగానే వాడాల్సివచ్చింది. అయితే, ప్రాపర్‌నౌన్స్‌ విషయంలో మాత్రమే పూర్తిగా ఆంగ్లపదాలే వాడాను.

దాదాపు ఇరవయ్యేళ్లుగా నా ప్రతి అడుగులోనూ నాకు ఆలంబనగా నిలుస్తున్న మిత్రుడు కె.వి. కుటుంబరావు ఈ పుస్తకం విషయంలో పలు కీలకమైన సూచనలు చేశారు. ఆయనతోపాటు, ఈ పుస్తకం ఇలా బయటికి రావడానికి సహకరించిన మిత్రులందరికీ కృతజ్ఞతలు. నా గత పుస్తకాల్లాగే ఈ పుస్తకాన్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

– సురేశ్‌ వెలుగూరి 

————————————————————————–

 

టైటిల్ః వ‌ర్క్‌ప్లేస్‌లో ఇలా గెల‌వండి. ర‌చ‌యితః సురేశ్ వెలుగూరి. పేజీలుః 192, ధ‌రః రు.199.
ప్రింట్‌ కాపీలు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌ లోని ప్ర‌ముఖ బుక్‌స్టోర్స్ అన్నిచోట్లా ల‌భిస్తాయి.
అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, కోబో, కినిగె వంటి ప్ర‌ముఖ ఈబుక్ స్టోర్స్ నుంచి ఈ పుస్త‌కం ఎల‌క్ట్రానిక్ కాపీలు కొనుక్కోవ‌చ్చు.

amazon-india-logo         Flipkart_logo       kobo_logo_FINALPMS     Kinige_logo_big

ఈ పుస్త‌కంలోని వ్యాసాల ప‌రిచ‌యాన్ని చ‌ద‌వాలంటే ఇక్క‌డ క్లిక్ చేయండి.

గుర్తుంచుకోండి, మీ ఉద్యోగ ప్ర‌దేశంలో మిమ్మ‌ల్ని గెలిపించే కీల‌క స‌మాచార‌మంతా ఈ పుస్త‌కంలో వుంది. ఇది మీ ద‌గ్గ‌రుంటే మీరు నిర్భ‌యంగా, నిరంత‌రాయంగా ప‌నిచేసుకుంటూ వెళ్లిపోవ‌చ్చు. ఏ రంగంలో ప‌నిచేస్తున్నార‌నే దానితో సంబంధం లేకుండా … ప్ర‌తి ఉద్యోగి వ‌ద్ద త‌ప్ప‌క వుండితీరాల్సిన పుస్త‌కం. మీ కాపీని నేడే ఆర్డ‌ర్ చేయండి. ఆల్ ది బెస్ట్‌.

Author’s blog: vmrgsuresh.wordpress.com
Follow Suresh on Facebook & Twitter: vmrgsuresh

చ‌దువుకుంటూనే .. ఇలా ఉద్యోగాలు చేసుకోవ‌చ్చు

అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లోలాగా మన విద్యార్థులకు చదువుకుంటూనే ఉద్యోగాలు చేసే అవకాశాలు లేకపోవచ్చు. మన మార్కెట్లు కూడా అందుకు సిద్ధపడకపోవచ్చు. కానీ, అసలుకు అవకాశాలంటూ మాత్రం లేకపోలేదు. చదువుకుంటూనే కొంత సమయం కేటాయించుకోగలిగితే మన విద్యార్థులకు కూడా తమ కనీసావసరాల మేరకు సంపాదించుకోగల వీలుంది. ఇంటర్‌నెట్‌ ఇందుకు అనేక అవకాశాలు కల్పిస్తోంది. వివరాలకు ఈ కథనం చదవండి.

onlinejobs_students_fb2

ఇంటర్‌నెట్‌ విశ్వవ్యాపార కేంద్రంగా మారిపోయింది. డబ్బు సంపాదించుకోవడానికి వేలాది అవకాశాలను అందిస్తోంది. వీటినుంచి మీ నైపుణ్యాల ఆధారంగా నచ్చిన అవకాశాన్ని ఎంచుకోవచ్చు. ఉదాహరణకి ఫ్రీలాన్స్‌ రైటింగే తీసుకోండి. ఒక విషయం ఇచ్చి, దానిమీద వేర్వేరు సోర్స్‌ల నుంచి కంటెంట్‌ తీసుకుని, కావల్సిన మోడ్‌లో రాసివ్వమంటే చాలామంది విద్యార్థులు చేయగలుగుతారు. ఆర్టికల్స్‌, బ్లాగ్‌ పోస్టులు రాయగలుగుతారు. కంప్యూటర్‌ పరిజ్ఞానం బాగా వున్నవారికి కీడేటా ఎంట్రీ అవకాశాలుంటాయి. ఇంకా సర్వేలు, శాంపిళ్ల తయారీ మొదలైన అంశాలూ ఎంచుకోవచ్చు. గ్లోబల్‌ ఆన్‌లైన్‌ మార్కెట్లకు వర్చువల్‌గా సహకరించవచ్చు. విద్యార్థులకు ఉపయోగపడే నాలుగు ఆన్‌లైన్‌ అవకాశాలు చూడండి.

1) సర్వేల నిర్వహణ 

సర్వేలు పూర్తిచేసే డబ్బులిస్తామనే ప్రకటనలు మన స్పామ్‌మెయిల్స్‌ ఫోల్డర్‌లో బాగానే కనపడుతుంటాయి. ఇవన్నీ సరైనవే కాకపోవచ్చు కానీ, జెన్యూన్‌ ఏజెన్సీలు కూడా బాగానే వున్నాయి. ఇంటర్‌నెట్‌ ద్వారానే ఆయా కంపెనీల జెన్యూనిటీని తెలుసుకోవచ్చు. ఈ పనులన్నీ పెద్ద ఆసక్తికరంగా, క్రియేటివ్‌గా అనిపించవు కానీ, సర్వేల ద్వారా మంచి ఆదాయమే వస్తుంది. కింద పేర్కొన్న మూడు వెబ్‌సైట్లకి సర్వేల నిర్వహణ సంస్థల్లో జెన్యూన్‌ అనే గుర్తింపుంది. వీటినుంచి విద్యార్థులు అవకాశాలు తెచ్చుకోవచ్చు.

  1. iPoll (https://www.ipoll.com)
  2. My Points (https://www.mypoints.com/emp/u/surveys.vm)
  3. Survey Spot (https://www.surveyspot.com)

2) కంటెంట్‌ రైటింగ్‌

ఇది చాలా విస్తారమైన రంగం. అకడమిక్‌ వ్యాసాలు రాయడం, బ్లాగులు, వెబ్‌సైట్లకు కంటెంట్‌ రాయడం, థీసిస్‌ పేపర్లు రాసేవారికి కంటెంట్‌ సహకారం అందించడం వంటి పనుల ద్వారా మంచి ఆదాయమే లభిస్తుంది. ఇంగ్లీష్‌ భాషలో, కమ్యూనికేషన్‌ అంశాల్లో మంచి పట్టున్నవారికి కంటెంట్‌ రైటింగ్‌లో విస్తృతంగా అవకాశాలున్నాయి. డేటా ఎంట్రీ అవకాశాలు కూడా ఇందులో భాగంగా లభిస్తుంటాయి. కింద పేర్కొన్న కంపెనీలకు జెన్యూన్‌ అనే గుర్తింపుంది.

  1. upWork (www.upwork.com)
  2. Text Broker (www.textbroker.com)
  3. Elance (www.elance.com)

3) వర్చువల్‌ అసిస్టెన్స్‌

‘వర్చువల్‌ అసిస్టెన్స్‌’ అనే పదమే కొత్తగా వుంది కదా! నిజమే, మీరున్నచోటే వుండి, మీరెంచుకున్న కంపెనీకి సంబంధించిన అపాయింట్‌మెంట్‌ వ్యవహారాలు చూడడం, ఫోన్‌కాల్స్‌ చేయడం, ఈమెయిల్స్‌ రాయడం, వచ్చిన ఈమెయిల్స్‌కి జవాబులివ్వడం, రూట్‌గైడెన్స్‌ ఇవ్వడం లాంటి పనులన్నీ వర్చువల్‌ అసిస్టెన్స్‌ కిందికి వస్తాయి. మీరు ఏ టైమ్‌ నుంచి ఏ టైమ్‌ వరకూ పనిచేయగలరో ముందే నిర్ణయించుకుని, దానికి తగినట్లుగా కంపెనీలతో ఒప్పందం చేసుకోవడం మంచిది. వర్చువల్‌ అసిస్టెన్స్‌ వెబ్‌సైట్స్‌ ఇప్పుడిప్పుడే బాగా వస్తున్నాయి. అయితే, ఫ్రీలాన్సింగ్‌ వెబ్‌సైట్లన్నీ కూడా ఈ అవకాశాలు అందిస్తున్నాయి.

  1. Elance (www.elance.com)
  2. iFreelance (ifreelance.com)
  3. Guru (www.guru.com)
  4. upWork (www.upwork.com)

4) ఆన్‌లైన్‌ ట్యూటరింగ్‌

ప్రతి ఒక్కరికీ ఒక సొంత సబ్జెక్టంటూ వుంటుంది కదా! స్నేహితులో, స్నేహితుల కుటుంబసభ్యులో, తెలిసినవాళ్లో ఆ సబ్జెక్ట్‌లో తమ సందేహాలు తీర్చమని తరచూ అడుగుతుంటారు కదా! దీన్నే ఉపాధి అవకాశంగా మలచుకోవచ్చు. వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా పాఠాలు చెప్పే అవకాశాలు ఇప్పుడు బాగా పెరిగాయి. ఆడియో వీడియో ఫీచర్లతో ఒక ల్యాప్‌టాప్‌, మంచి ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌ వుంటే చాలు. మీ సొంత వెబ్‌సైట్‌ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కొన్ని వెబ్‌సైట్లు నామినల్‌ ఛార్జీలతో ఆన్‌లైన్‌ ట్యూటరింగ్‌ టూల్స్‌ని అందిస్తున్నాయి. కింద పేర్కొన్న కొన్ని వెబ్‌సైట్లలో ఏదోఒకదానిని ఎంచుకోవచ్చు. ఓపెన్‌సోర్స్‌ ద్వారా ఉచితంగా కూడా ఆన్‌లైన్‌ ట్యూటరింగ్‌ టూల్స్‌ అందించే వెబ్‌సైట్లున్నాయి.

  1. Tutor (www.tutor.com)
  2. Aim 4A (www.aim4a.tutor.php)
  3. MilZul (www.milzul.com)
  4. WizIQ (www.wiziq.com)

అవ‌కాశాలు అందుకోవ‌డానికి ఇలా సిద్ధ‌మ‌వండి 

పైన పేర్కొన్నవాటిలో ఏ అవకాశం పొందాలన్నా ముందుగా మీ ప్రొఫైల్‌ను సిద్ధం చేసుకోండి. నమ్మకమైన జాబ్‌పోర్టల్స్‌లో దానిని అప్‌లోడ్‌ చేసివుంచుకోండి. ఏ క్లయింట్‌ని సంప్రదించినా ఆ ప్రొఫైల్‌ లింక్‌ని మాత్రమే ఇవ్వండి. మీ పర్సనల్‌ ఈమెయిల్‌ ఐడీని కాక, ఇందుకోసం ఒక కొత్త ఈమెయిల్‌ ఐడీని సృష్టించుకోవడం మంచిది.

జెన్యూన్‌ అని పేర్కొన్న వెబ్‌సైట్లన్నీ మీకొచ్చే ఆదాయాన్ని నేరుగా మీ అకౌంట్‌కే జమచేస్తాయి. మీ అకౌంట్‌ వివరాలను మీ ప్రొఫైల్‌ అప్‌డేట్‌ చేసే సమయంలోనే తీసేసుకుంటాయి. వాటితో ఇబ్బంది లేదు. కానీ, తెలియని కంపెనీ కోసం పనిచేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అగ్రిమెంట్‌ అడగాలి. మీ ప్రొఫైల్‌ నచ్చితే ఏ కంపెనీ కూడా మిమ్మల్ని వదులుకోదని గుర్తుపెట్టుకోండి.

అధికారిక ఈమెయిల్‌ అకౌంట్ల నుంచి మాత్రమే ఈమెయిల్స్‌ అంగీకరించండి. ఉదాహరణకి పెద్దకంపెనీలు ఏవీ జీమెయిల్‌, యాహూ లాంటి సర్వీస్‌ ప్రొవైడర్ల నుంచి ఈమెయిల్‌ అకౌంట్లు తీసుకోవు. సొంత సర్వర్‌ నుంచి సృష్టించుకున్న ఈమెయిల్‌ అకౌంట్స్‌ మాత్రమే వాడతాయి. ఉదాహరణకి …

తీరికవేళల్లో, లేదా, రోజూ పర్టిక్యులర్‌గా కొన్ని గంటలు కేటాయించుకునో విద్యార్థులు ఈ తరహా అవకాశాలు ఉపయోగించుకోవచ్చు. చదువు డిస్టర్బ్‌ కాకుండా సమయాన్ని జాగ్రత్తగా వాడుకోగలగాలి. తాము చదువుకుంటున్న రంగానికి సంబంధించిన అవకాశాల్నే ఎంచుకునే విద్యార్థులకు ఇది ఇంకా మేలు చేస్తుంది.

– సురేశ్ వెలుగూరి
ఫోన్ః 8125968527

————————————————————————–ఇంకా, వ‌ర్క్‌ప్లేస్ మేనేజ్‌మెంట్‌కి సంబంధించిన వంద‌లాది అంశాల‌పై స‌మ‌గ్ర స‌మాచారం కోసం వ‌ర్క్‌ప్లేస్‌లో ఇలా గెల‌వండి అనే పుస్త‌కం మీకు సాయ‌ప‌డుతుంది. వివ‌రాలుః 

టైటిల్ః వ‌ర్క్‌ప్లేస్‌లో ఇలా గెల‌వండి. ర‌చ‌యితః సురేశ్ వెలుగూరి. పేజీలుః 192, ధ‌రః రు.199.
ప్రింట్‌ కాపీలు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌ లోని ప్ర‌ముఖ బుక్‌స్టోర్స్ అన్నిచోట్లా ల‌భిస్తాయి.
అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, కోబో, కినిగె వంటి ప్ర‌ముఖ ఈబుక్ స్టోర్స్ నుంచి ఈ పుస్త‌కం ఎల‌క్ట్రానిక్ కాపీలు కొనుక్కోవ‌చ్చు.

amazon-india-logo         Flipkart_logo       kobo_logo_FINALPMS     Kinige_logo_big

ఈ పుస్త‌కంలోని వ్యాసాల ప‌రిచ‌యాన్ని చ‌ద‌వాలంటే ఇక్క‌డ క్లిక్ చేయండి.

గుర్తుంచుకోండి, మీ ఉద్యోగ ప్ర‌దేశంలో మిమ్మ‌ల్ని గెలిపించే కీల‌క స‌మాచార‌మంతా ఈ పుస్త‌కంలో వుంది. ఇది మీ ద‌గ్గ‌రుంటే మీరు నిర్భ‌యంగా, నిరంత‌రాయంగా ప‌నిచేసుకుంటూ వెళ్లిపోవ‌చ్చు. ఏ రంగంలో ప‌నిచేస్తున్నార‌నే దానితో సంబంధం లేకుండా … ప్ర‌తి ఉద్యోగి వ‌ద్ద త‌ప్ప‌క వుండితీరాల్సిన పుస్త‌కం. మీ కాపీని నేడే ఆర్డ‌ర్ చేయండి. ఆల్ ది బెస్ట్‌.

Author’s blog: vmrgsuresh.wordpress.com
Follow Suresh on Facebook & Twitter: vmrgsuresh

ఐటీ మిత్రులూ … మేలుకోండి

ప్ర‌పంచం చాలా చిన్న‌ది, అవ‌కాశాలు చాలా పెద్ద‌వి. అందుకోగ‌లిగామా అవి అనంతం.

apps_story_fb

ఏడాది కాలంగా కొన్ని కొత్త డొమెయిన్స్ గురించి, ప్ర‌ధానంగా ఓపెన్‌సోర్స్ అవ‌కాశాల మీద‌ ఆర్ & డి చేస్తున్నాను. ప్ర‌పంచాన్ని చేతివేళ్ల కొస‌ల మీదికి తీసుకొస్తున్న‌ “స్మార్ట్ మొబైల్ ఫోన్ టెక్నాల‌జీ” రేప‌టి త‌రాన్ని మ‌రింత‌గా శాసించ‌బోతోంద‌ని అర్థ‌మ‌వుతోంది. ముఖ్యంగా 4 రంగాల్లో ఈ ప్ర‌భావం చాలా ఎక్కువ‌గా వుంటుంది. అక‌డ‌మిక్స్‌, బ్యాంకింగ్‌, షాపింగ్‌, ప‌బ్లిక్ యుటిలిటీ స‌ర్వీసెస్‌. ఇప్ప‌టికంటే వంద రెట్ల సెక్యూరిటీతో మొబైల్ టెక్నాల‌జీ బ‌ల‌ప‌డ‌నుంది. కోటి రూపాయ‌ల ట‌ర్నోవ‌ర్ చేయ‌గ‌ల అప్లికేష‌న్ల‌ను కేవ‌లం యాభై వేల నుంచి ల‌క్ష రూపాయ‌ల్లోపే డిజైన్ చేసుకోగ‌ల అవ‌కాశాలు పెరుగుతున్నాయి. ఇప్ప‌టికే ఇలాంటి అవ‌కాశాలు పుష్క‌లంగా వున్నాయి. మార్కెటింగ్ ప‌రిధులు కూడా మారిపోతాయి.

వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రం నుంచి ఎంట‌ర్‌ప్రెన్యూర్స్ పెర‌గ‌బోతున్నారని చాలా స‌ర్వేలు చెప్తున్నాయి. 15 సంవ‌త్స‌రాల ఎక్స్‌పీరియ‌న్స్ వుండి, ల‌క్ష రూపాయ‌లు దాటి జీతాలు తీసుకుంటున్న‌వారి ఉద్యోగావ‌కాశాల‌కు దేశ‌వ్యాప్తంగా గండి ప‌డే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఉద్యోగుల‌ను త‌గ్గించుకోవ‌డ‌మో, లేదా రేష‌న‌ల్ జీతాల‌తో బండి న‌డ‌ప‌డ‌మో చేయ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి రావ‌చ్చ‌ని నిపుణులు చెప్తున్నారు. వీరిలో చాలామంది ఎంట‌ర్‌ప్రెన్యూర్‌షిప్ వైపే చూడ‌క త‌ప్ప‌ని ద‌శ రానుంది. ఇది భార‌తీయ మార్కెట్లు పుంజుకోవ‌డానికి మంచి అవ‌కాశ‌మిస్తుంది.

ప్ర‌భుత్వ‌రంగంలో కూడా ప‌బ్లిక్ యుటిలిటీ సేవ‌ల కోసం వేలాది (స్టాండ‌ర్డ్‌) అప్లికేష‌న్ల అవ‌స‌రం పెర‌గ‌నుంది. మైక్రోసాఫ్ట్ వంటి ప్రొప్ర‌యిట‌రీ సాఫ్ట్‌వేర్ల కంటే ఓపెన్‌సోర్స్ ద్వారా త‌యార‌య్యే అప్లికేష‌న్ల‌కే ఎక్కువ డిమాండ్ రానుంది. ఈ అంశాల నేప‌థ్యంలో సోహో ( Small Office – Home Office) కాన్సెప్ట్ ఇండియాలో బాగా పెర‌గ‌నుంది. ఇంటి నుంచి ప‌నిచేస్తూ, మార్కెట్‌ను నడిపే ప్రొఫెష‌న‌ల్స్ పెరుగుతారు. మ‌రోవైపు ప్రభుత్వ‌, ప్ర‌యివేటు హ‌బ్స్ కూడా పెరుగుతాయి. ఈ హ‌బ్స్‌లో త‌క్కువ ఖ‌ర్చుతో ఎక్కువ అవ‌కాశాలు పొందే వీల‌వుతుంది.

మ‌రోవైపు ఈ ప‌రిణామాలు కుటుంబాల మ‌ధ్య మాన‌సిక స‌మ‌తుల్య‌త‌ను పెంచే అవ‌కాశాలు కూడా క‌నిపిస్తున్నాయి. మైక్రో ఫ్యామిలీలుగా మారిన కుటుంబాలు క‌ల‌వ‌డం, బ్రాడ్‌బ్యాండ్ విస్తృతి కార‌ణంగా చిన్న‌చిన్న ప‌ట్ట‌ణాలు, త‌మ సొంత గ్రామాల్లో వుంటూకూడా త‌మ ప‌నులు నిర్వ‌హించుకోగ‌ల సానుకూల స్థితులు రావ‌చ్చు. విద్య‌, వైద్యం, ర‌వాణా, మౌలిక స‌దుపాయాల మీద ప్ర‌భుత్వాలు శ్ర‌ద్ధ పెడితే ఎంట‌ర్‌ప్రెన్యూర్స్ బాగా పెరుగుతారు.

ఇన్ని తేనెచుక్క‌ల మ‌ధ్య ఒక విష‌పు చుక్క‌ను కూడా చూడాల్సివుంటుంది. చిన్న‌చిన్న కంపెనీలు పెట్టుకుని, విలువైన ప్రాజెక్ట్స్ తెచ్చుకుని బ‌తుకుతున్న‌ ప్రొఫెష‌న‌ల్స్‌ను దారిలోకి తెచ్చుకుని, వారి కంపెనీల‌ను కొని, వారిని త‌మ ద‌గ్గ‌ర ఉద్యోగులుగా చేర్చుకునే కంపెనీలు (ఉదాహ‌ర‌ణ‌కి కాగ్నిజెంట్‌) మ‌రింత పుంజుకుంటాయి. ఇలాంటి విప‌రిణామాల్ని జాగ్ర‌త్త‌గా దాటుకోగ‌లిగితే రాబోయే ఐదేళ్ల‌లో దేశంలో క‌నీసం రెండు కోట్ల మంది కొత్త ఎంట‌ర్‌ప్రెన్యూర్స్ ప్ర‌వేశిస్తార‌ని అంచ‌నా.

లెట్జ్‌ హోప్ ఫ‌ర్ ఎ గుడ్ బిగినింగ్‌.

మీ ఉద్యోగం పోగొట్టుకోవడానికి ఉపయోగపడే 15 కారణాలు

మా చిన్నప్పుడు గవర్నమెంటు ఉద్యోగుల మీద ఒక సామెత వినిపిస్తుండేది. ”పనిచేసేవాడికి పల్లేరుగాయలు, ఎగ్గొట్టేవాడికి ఎదురు నమస్కారాలు” అని. సర్కారీ కొలువుల్లో ఇప్పుడా వైరస్‌ ప్రభావం కొంచెం తగ్గింది కానీ, ప్రయివేటు రంగంలో మాత్రం బలంగానే కనిపిస్తోంది. క్యాపిటల్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ప్రాజెక్ట్స్‌, రెవెన్యూ – అనే నాలుగు స్తంభాల మీద నిలబడి పనిచేసే ప్రయివేటు కంపెనీల్లో ఉద్యోగాలు సాధించడం ఎంత కష్టమో, వాటిని నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టంగా మారుతోంది. ఆఫీసులు కూడా అనేక వైరుధ్యాలకు తావులవుతున్నాయి. ఇక్కడ కూడా … ఒళ్లొంచి పనిచేసేవాడికి పల్లేరుగాయలు, రాజకీయాలు చేసేవాడికి ఎదురునమస్కారాలు అనే తరహా పరిస్థితులు ఎదురవుతున్నాయి.

సబ్జెక్ట్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, కష్టపడి పనిచేసే తత్వం వుంటే చాలు, ఎక్కడైనా పనిలో స్థిరపడిపోవచ్చని చాలామంది భావిస్తారు. నిజమే. కానీ, ఈ మూడింటినీ పెంచుకుంటూ, పై పేరాలో పేర్కొన్న మూడింటినీ తగ్గించుకుంటూ వెళ్లకపోతే, ఇక ఉద్యోగానికి నీళ్లు ఒదులుకోవడమే. ఇరవై ఏళ్ల చదువులు, అనేక ఆటంకాలను తట్టుకుంటూ, వాటికి ఎదురునిలబడి గెలుస్తూ ఉద్యోగ జీవితంలోకి అడుగుపెట్టిన మనిషికి అక్కడి పరిస్థితులు అవకాశాల్ని పెంచేలా వుండాలి కానీ, అతడిని నిస్పృహలోకి దించేలా వుండకూడదు. అఫ్‌కోర్స్‌, మనం ఎలా కావాలనుకుంటే అలా మడుచుకోవడానికి జీవితం చాప కాదు. ‘ఎప్పటికెయ్యది నెయ్యమో అప్పటికా మాటలాడి’ అనే సుమతీ పద్యాన్ని కూడా పాటించలేం. కానీ, ఈ సమస్యల నుంచి బయటపడాలి, లేకుంటే భవిష్యత్‌ లేదు.

ఈ వ్యాసంలో రాస్తున్న అంశాలన్నీ ఇటువంటి యువతీయువకులను దృష్టిలో పెట్టుకునే తీసుకున్నాను. పరిష్కారాలను సూచించడం కంటే, మనం చేసే తప్పులు, పొరపాట్లను ప్రస్తావించడమే ప్రధానంగా తీసుకున్నాను. ఏది చేయకూడదో అది స్పష్టంగా రాస్తే, అది ఎందుకు చేయకూడదో తెలుసుకోగల నైపుణ్యం మన కొత్తతరం ఉద్యోగులకు వుందని నా నమ్మకం.

ఇక పదండి, ఉద్యోగాలు పోగొట్టుకోవడానికి ఉపయోగపడే 15 కారణాలను వరుసగా చూద్దాం.

1) పనిలో నాన్చుడు ధోరణి

చాలామంది ఉద్యోగులు తమకు అప్పగించిన పనిని ఎప్పటికప్పుడు పూర్తిచేయకుండా, ఆఖరి నిముషం దాకా నాన్చడం, లాస్ట్‌ అవర్‌లో హడావుడిగా పని ప్రారంభించడం చూస్తుంటాం. సహజంగా ఆఫీసులో పనులన్నీ చాలామంది ఉద్యోగుల బాధ్యతలతో కనెక్ట్‌ అయివుంటాయి. మనలో ఒక్కరు చేసే డిలే కారణంగా ఇతరుల పనులు కూడా ఆలస్యమవుతుంటాయి. ఆఖరి నిముషంలో పని తొందర తొందరగా పూర్తి చేయాలనే వేడిలో మన లోపలి ఆవేశం బయటికి తన్నుకొచ్చేస్తుంది. ఆలస్యానికి కారణం మనమే అయినా, దానిని ఒప్పుకోవడం కంటే సహోద్యోగుల మీదికి దానిని తోసేయడానికే ఎక్కువ ఇష్టపడతార. ఫలితంగా ప్రాజెక్టు డిలే కావడానికి ప్రథమ కారణం మనమే అవుతుంటాం.

(పూర్తి వ్యాసం కోసం ‘వ‌ర్క్‌ప్లేస్‌లో ఇలా గెల‌వండి’ పుస్త‌కం చ‌ద‌వండి).

————————————————————————–

టైటిల్ః వ‌ర్క్‌ప్లేస్‌లో ఇలా గెల‌వండి. ర‌చ‌యితః సురేశ్ వెలుగూరి. పేజీలుః 192, ధ‌రః రు.199.
ప్రింట్‌ కాపీలు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌ లోని ప్ర‌ముఖ బుక్‌స్టోర్స్ అన్నిచోట్లా ల‌భిస్తాయి.
అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, కోబో, కినిగె వంటి ప్ర‌ముఖ ఈబుక్ స్టోర్స్ నుంచి ఈ పుస్త‌కం ఎల‌క్ట్రానిక్ కాపీలు కొనుక్కోవ‌చ్చు.

amazon-india-logo         Flipkart_logo       kobo_logo_FINALPMS     Kinige_logo_big

ఈ పుస్త‌కంలోని వ్యాసాల ప‌రిచ‌యాన్ని చ‌ద‌వాలంటే ఇక్క‌డ క్లిక్ చేయండి.

గుర్తుంచుకోండి, మీ ఉద్యోగ ప్ర‌దేశంలో మిమ్మ‌ల్ని గెలిపించే కీల‌క స‌మాచార‌మంతా ఈ పుస్త‌కంలో వుంది. ఇది మీ ద‌గ్గ‌రుంటే మీరు నిర్భ‌యంగా, నిరంత‌రాయంగా ప‌నిచేసుకుంటూ వెళ్లిపోవ‌చ్చు. ఏ రంగంలో ప‌నిచేస్తున్నార‌నే దానితో సంబంధం లేకుండా … ప్ర‌తి ఉద్యోగి వ‌ద్ద త‌ప్ప‌క వుండితీరాల్సిన పుస్త‌కం. మీ కాపీని నేడే ఆర్డ‌ర్ చేయండి. ఆల్ ది బెస్ట్‌.

Author’s blog: vmrgsuresh.wordpress.com
Follow Suresh on Facebook & Twitter: vmrgsuresh