వ‌ర్క్‌ప్లేస్‌లో ఇలా గెల‌వండి !!

వ‌ర్క్‌ప్లేస్ (ఆఫీస్‌) అనేక అనుభ‌వాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌. ఇక్క‌డ నేర్చుకునే పాఠాలే అనుభ‌వాలుగా మారి మ‌నిషి జీవితాన్ని స‌క్ర‌మంగా ముందుకు న‌డిపిస్తాయి. ఒక ఉద్యోగి గెలిచినా, ఓడినా అది వారు త‌మ వ‌ర్క్‌ప్లేస్‌ల‌ను అర్థం చేసుకోవ‌డం మీదే ఆధార‌ప‌డివుంటుంద‌ని నిపుణులు చెప్తారు.

ఇప్పుడే కాలేజీలు, యూనివ‌ర్సిటీల నుంచి బ‌య‌టికొచ్చి ఉద్యోగాల్లో చేరుతున్న కొత్త‌త‌రం యువ‌తీ యువ‌కుల సంఖ్య ఇప్పుడు బాగా పెరుగుతోంది. వీరికి వ‌ర్క్‌ప్లేస్ మీద ఆస‌క్తి, ఇష్టం ఎంతుంటాయో, అపోహ‌లు, భ‌యాలు కూడా అన్నుంటాయి. వ‌ర్క్‌ప్లేస్ ఎలా వుంటుంది, స‌హోద్యోగులు ఎలా ప్ర‌వ‌ర్తిస్తారు, మేనేజ్‌మెంట్ వ్య‌వ‌హారాలెలా వుంటాయి, న‌లుగురితో క‌లిసిపోవ‌డ‌మెలా? ఒత్తిళ్లు ఎదుర్కోవ‌డం, విజ‌య‌వంతంగా త‌మ బాధ్య‌త‌లు పూర్తిచేయ‌డ‌మెలా … ఇలాంటి అనేక ప్ర‌శ్న‌లు, సందేహాలు వారిని తొలిచేస్తుంటాయి. ఇన్ని భ‌యాందోళ‌న‌ల మ‌ధ్య తాము ఉద్యోగం చేయ‌గ‌ల‌మా అనే అనుమానాలూ వారిలో త‌లెత్తుతుంటాయి. నిజం చెప్పాలంటే ఇవ‌న్నీ అర్థం లేని భ‌యాలు. ఎక్క‌డ ఎలా వ్య‌వ‌హ‌రించాలో స‌మాచారం తెలుసుకోవ‌డం, కాస్తంత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించ‌డం చేస్తే ఏ ఉద్యోగైనా దీర్ఘ‌కాలం విజ‌య‌వంతంగా ఉద్యోగం చేయ‌గ‌లుగుతారు.

WP Cover-Final_Front_WEBఇలా ఉద్యోగుల‌కు అవ‌స‌ర‌మ‌య్యే ప‌లు అంశాల మీద తెలుగులో ఇప్ప‌టిదాకా స‌మాచారం లేని కొర‌త‌ను తీర్చ‌డానికి,  పై ప్ర‌శ్న‌ల‌న్నిటికీ జ‌వాబులిచ్చే సంజీవ‌ని లాంటి పుస్త‌కం ఇప్పుడు అందుబాటులోకి వ‌చ్చింది. ‘వ‌ర్క్‌ప్లేస్ మేనేజ్‌మెంట్‌’కి సంబంధించిన స‌మ‌గ్ర స‌మాచారంతో తెలుగులో ఇదే మొట్టమొద‌టి పుస్త‌కం ఇప్పుడు మార్కెట్‌లోకి విడుద‌లైంది. ‘వ‌ర్క్‌ప్లేస్‌లో ఇలా గెల‌వండి’ పేరుతో రూపొందిన ఈ పుస్త‌కం కొత్త‌త‌రం ఉద్యోగుల‌తో స‌హా ఉద్యోగులంద‌రికీ కీల‌కంగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

విఎమ్ఆర్‌జి ఇంట‌ర్నేష‌న‌ల్ వ‌ర్క్‌ప్లేస్ మేనేజ్‌మెంట్ అంశంపై మొత్తం ఎనిమిది పుస్త‌కాలు ప్ర‌చురించాల‌ని నిర్ణ‌యించింది. ఇందులో తొలి పుస్త‌కం ఇది. ఈ పుస్త‌కం మీకెలా ఉప‌యోగ‌ప‌డుతుందో కింది పాయింట్లు వివ‌రిస్తాయి.

ఈ పుస్త‌కం మీకు… 

>  ఆఫీసు వాతావరణాలను ఎలా అర్థం చేసుకోవాలో వివరిస్తుంది
>  ఆఫీసులో భిన్న మనస్తత్వాలను ఎలా సమన్వయం చేసుకోవాలో అవగాహన కల్పిస్తుంది
>  మీ విధుల నిర్వహణలో పాటించాల్సిన పారదర్శక ప్రమాణాలను సూచిస్తుంది
>  మీ పనితీరును మెరుగుపరచుకోవడం, ఉద్యోగిగా మీ హోదాను పెంచుకునే మార్గాలు సూచిస్తుంది
>  బాస్‌ / కంపెనీ మెచ్చేవిధంగా మిమ్మల్ని మీరు బలంగా మలచుకోవడం ఎలాగో తెలుపుతుంది
>  ఆయా సందర్భాల్లో మిమ్మల్ని మీరెలా కాపాడుకోవాలో వివరిస్తుంది
>  ఉద్యోగ జీవితంలో ఎదగడానికి మీకు మీరుగా అవకాశాల్ని ఎలా సృష్టించుకోవాలో తెలియజేస్తుంది
>  ఉద్యోగం స్థిరంగా కొనసాగించుకునే మార్గాలు తెలియజేస్తుంది
>  ఆఫీసు రాజకీయాల్ని ఎదుర్కొనే పద్ధతులు సూచిస్తుంది
>  ఉద్యోగ సంబంధాలు, మానవ సంబంధాల పరిమితుల్ని వివరిస్తుంది
>  ఆఫీసు వాతావరణాలకు తగిన ప్రవర్తన, వ్యూహాల్ని సూచిస్తుంది
>  ఆఫీసులో మానవ సంబంధాల నిర్వహణలో మెళకువలు తెలుపుతుంది
>  ఓపెన్‌ కమ్యూనికేషన్‌ విధానాలను వివరిస్తుంది
>  వర్క్‌ప్లేస్‌లో మహిళలు రాణించడానికి తోడ్పడే సమాచారమిస్తుంది
>  వర్క్‌ప్లేస్‌లో మహిళల భద్రత గురించిన సమాచారం ఇస్తుంది
>  ఉద్యోగం నుంచి జీవితపాఠాలు నేర్చుకోవడంపై సూచనలిస్తుంది
>  భాష, కమ్యూనికేషన్‌ ఇబ్బందుల్ని అధిగమించే మార్గాలు సూచిస్తుంది
>  ఉద్యోగులుగా మీ హక్కుల్ని కాపాడుకోవడానికి వున్న చట్టాల గురించిన సమాచారం అందిస్తుంది
>  ఉద్యోగులైన భార్యాభర్తల మధ్య సమన్వయంపై సమాచారమిస్తుంది

టైటిల్ః వ‌ర్క్‌ప్లేస్‌లో ఇలా గెల‌వండి. ర‌చ‌యితః సురేశ్ వెలుగూరి. పేజీలుః 180. ధ‌రః రు.199.
ప్రింట్‌ కాపీలు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌ లోని కొన్ని ప్ర‌ముఖ బుక్‌స్టోర్స్‌ల‌లో ల‌భిస్తాయి.

నేరుగా తెప్పించుకోవాలంటే 9849970455 నెంబ‌ర్‌కి ఫోన్ చేయండి.
హైద‌రాబాద్‌లో అయితే విఎమ్ఆర్‌జి సిబ్బంది మీ ఇంటికే చేరుస్తారు. ఎలాంటి అద‌న‌పు చార్జీలుండ‌వు.
విఎమ్ఆర్‌జి కార్యాల‌యంలో నేరుగా కొనుగోలు చేయ‌వ‌చ్చు. 20% త‌గ్గింపు ల‌భిస్తుంది.

అమెజాన్ నుంచి ప్రింట్ కాపీలు, కినిగె నుంచి ఈబుక్ కొనుక్కోవ‌చ్చు.

amazon-india-logo       Kinige_logo_big

ఈ పుస్త‌కంలోని వ్యాసాల ప‌రిచ‌యాన్ని చ‌ద‌వాలంటే ఇక్క‌డ క్లిక్ చేయండి.

గుర్తుంచుకోండి, మీ ఉద్యోగ ప్ర‌దేశంలో మిమ్మ‌ల్ని గెలిపించే కీల‌క స‌మాచార‌మంతా ఈ పుస్త‌కంలో వుంది. ఇది మీ ద‌గ్గ‌రుంటే మీరు నిర్భ‌యంగా, నిరంత‌రాయంగా ప‌నిచేసుకుంటూ వెళ్లిపోవ‌చ్చు. ఏ రంగంలో ప‌నిచేస్తున్నార‌నే దానితో సంబంధం లేకుండా … ప్ర‌తి ఉద్యోగి వ‌ద్ద త‌ప్ప‌క వుండితీరాల్సిన పుస్త‌కం. మీ కాపీని నేడే ఆర్డ‌ర్ చేయండి. ఆల్ ది బెస్ట్‌.

Author’s blog: vmrgsuresh.wordpress.com
Follow Suresh on Facebook & Twitter: vmrgsuresh

 

Advertisements

Published by

myworkplacebooks

Myself Suresh Veluguri, a Content Writer & Language Services Manager by profession and social analyst by passion. I am producing some content for the benefit of young employees, managers and enterprenuers irrespective of their working domain. Here I am posting all the articles. Thank you.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s